ఏపీకి సగం ధరకే సోలార్ పవర్ సరఫరాకు ఒప్పందం
కొన్ని ప్రైవేట్ కంపెనీల నుంచి విద్యుత్‌ను అధిక ధరకు 25ఏళ్ల పాటు కొనుగోలు చేసేలా చంద్రబాబు ప్రభుత్వం గతంలో ఒప్పందాలు చేసుకుంది. దీని వల్ల ఏటా ఏపీ ప్రభుత్వంపై వేల కోట్ల భారం పడుతోంది. పీపీఏలను సమీక్షిస్తామని జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించగానే టీడీపీ, ప్రైవేట్ విద్యుత్ సంస్థలు గగ్గోలు పెట్టాయి. వ్యవహారం కోర్టుకు వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఎన్‌టీపీసీ, సెకీలు తక్కువ ధరకే సోలార్ విద్యుత్‌ను ఏపీకి అందించేందుకు ముందుకొచ్చాయి. […]
కొన్ని ప్రైవేట్ కంపెనీల నుంచి విద్యుత్‌ను అధిక ధరకు 25ఏళ్ల పాటు కొనుగోలు చేసేలా చంద్రబాబు ప్రభుత్వం గతంలో ఒప్పందాలు చేసుకుంది. దీని వల్ల ఏటా ఏపీ ప్రభుత్వంపై వేల కోట్ల భారం పడుతోంది. పీపీఏలను సమీక్షిస్తామని జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించగానే టీడీపీ, ప్రైవేట్ విద్యుత్ సంస్థలు గగ్గోలు పెట్టాయి. వ్యవహారం కోర్టుకు వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఎన్‌టీపీసీ, సెకీలు తక్కువ ధరకే సోలార్ విద్యుత్‌ను ఏపీకి అందించేందుకు ముందుకొచ్చాయి.
చంద్రబాబు హయాంలో యూనిట్ 5రూపాయలకు పైగా కొనుగోలుకు ఒప్పందాలు కుదరగా… ఇప్పుడు నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సెకీ)లు యూనిట్ రూ. 2.77 నుంచి 2.80 రూపాయలకు అందించేందుకు ముందుకొచ్చాయి. ఈ రెండు సంస్థలతో పీపీఏలను ప్రభుత్వం ఆమోదించిందని ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ వివరించారు.
ఈ ఒప్పందంలో భాగంగా రోజుకు 9 మిలియన్ యూనిట్ల సౌర విద్యుత్ తక్కువ ధరకే ఏపీకి అందబోతోంది. అనంతపురం జిల్లా నంబులపూలకుంటలో 750 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ప్లాంట్ నుంచి, అలాగే కృష్ణాజిల్లా మైలవరం వద్ద ఏర్పాటు చేసిన ప్లాంట్ నుంచి 750 మెగావాట్ల విద్యుత్‌ను ఏపీకి అందిస్తామని ఎన్‌టీపీసీ, సెకీ ప్రకటించాయి. ఈ రెండు ప్రభుత్వ సంస్థలు విద్యుత్‌ను బహిరంగ మార్కెట్‌లోని రేట్ల కంటే తక్కువకే విద్యుత్‌ను అందిస్తున్నాయి.
మరోవైపు వచ్చే ఏడాది విద్యుత్ డిమాండ్‌ను ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే ఏపీ ప్రభుత్వం సిద్దమవుతోంది. వచ్చే వేసవిలో డిమాండ్ రోజుకు 200మిలియన్ యూనిట్లకు పైగా ఉండవచ్చని అధికారులు అంచనా వేశారు. నివేదికను మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి అందించారు. డిమాండ్ ను ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులు, మంత్రి చర్చించారు.
గతంతో పోలిస్తే ఏసీలు భారీగా పెరగడం వల్ల వేసవిలో విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉంటోందని అధికారులు వివరించారు. గతేడాదితో పోలిస్తే ఏసీల వినియోగం లక్షకు పైగా పెరిగాయని వెల్లడించారు. ముందుగానే డిమాండ్‌ను అంచనా వేసి అందుకు తగట్టు చర్యలు తీసుకుంటున్నామని… కాబట్టి వచ్చే ఏడాది వేసవిలో విద్యుత్ సమస్య ఉండదని ప్రభుత్వం చెబుతోంది.