Telugu Global
NEWS

దివాలా తీసిన లింగమనేని...

ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ .. తనకు అప్పులు ఇచ్చిన వారికి శఠగోపం పెట్టేశారు. దివాలా ప్రకటించారు. రమేష్‌కు చెందిన లింగమనేని ఎస్టేట్స్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ దివాలా పిటిషన్‌ దాఖలు చేసింది. ఈనెల 14న ఎన్‌సీఎల్‌టీ ముందు ఈ కంపెనీ తన దివాలా పిటిషన్ వేసింది. అప్పులు ఇచ్చిన వారు ఈనెల 29 వరకు ఎన్‌సీఎల్‌టీ ముందు వాదనలు వినిపించుకోవచ్చు. తాము తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించలేనని లింగమనేని రమేష్ కంపెనీ తన దివాలా పిటిషన్‌లో […]

దివాలా తీసిన లింగమనేని...
X

ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ .. తనకు అప్పులు ఇచ్చిన వారికి శఠగోపం పెట్టేశారు. దివాలా ప్రకటించారు. రమేష్‌కు చెందిన లింగమనేని ఎస్టేట్స్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ దివాలా పిటిషన్‌ దాఖలు చేసింది. ఈనెల 14న ఎన్‌సీఎల్‌టీ ముందు ఈ కంపెనీ తన దివాలా పిటిషన్ వేసింది.

అప్పులు ఇచ్చిన వారు ఈనెల 29 వరకు ఎన్‌సీఎల్‌టీ ముందు వాదనలు వినిపించుకోవచ్చు. తాము తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించలేనని లింగమనేని రమేష్ కంపెనీ తన దివాలా పిటిషన్‌లో స్పష్టం చేశారు. ఈ పిటిషన్‌పై ఒక జాతీయ పత్రికలో ఎన్‌సీఎల్‌టీ నోటీస్‌ కూడా ప్రచురించింది.

పలు రంగాల్లో భారీగా పెట్టుబడులుపెడుతున్నామంటూ వేల కోట్ల రుణాలు సేకరించారు. కానీ ప్రాజెక్టులు ముందుకు వెళ్లలేదు. దాంతో రుణాలు తిరిగి చెల్లించలేమంటూ నేషనల్ కంపెనీస్ లా ట్రిబ్యునల్‌ ముందు దివాలా పిటిషన్‌ వేసింది. రియల్ ఎస్టేట్, పవర్‌ ప్లాంట్స్, ఎయిర్‌లైన్స్‌ రంగాల్లో లింగమనేని పెట్టుబడులున్నాయి. చంద్రబాబు నివాసం ఉంటున్న కరకట్ట నివాసం నిర్మించి ఇచ్చింది లింగమనేని రమేషే.

1996లో లింగమనేని లీప్ కంపెనీ విజయవాడ వేదికగా రిజిస్టర్ అయింది. లింగమనేని కంపెనీ దివాలా పిటిషన్‌పై 2020మే 12 నాటికి విచారణ పూర్తవుతుంది. ప్రాజెక్టుల పేరుతో అప్పులు తెచ్చి ఆ సొమ్మును దారి మళ్లించి… ప్రాజెక్టులు ఏర్పాటు చేయకుండా రుణాలు ఎగ్గొట్టేందుకు ఈ తరహా పంథాను కొందరు పెద్దలు అనుసరిస్తుంటారు.

First Published:  18 Nov 2019 8:07 AM IST
Next Story