గంటా...లింగమనేని ఆస్తుల వేలానికి రంగం సిద్ధం !
టీడీపీ అధినేత చంద్రబాబు సన్నిహితుల ఆస్తుల వేలానికి రంగం సిద్ధమైంది. మాజీ మంత్రి, విశాఖ నార్త్ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆస్తిని వేలం వేయనున్నట్లు బ్యాంకులు ప్రకటన విడుదల చేశాయి. ప్రత్యూష ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పేర ఇండియన్ బ్యాంక్ నుంచి భారీ రుణం తీసుకుని ఎగవేసిన కేసులో ఇప్పటికే బ్యాంకులు నోటీసులు జారీ చేశాయి. గంటా సకాలంలో బకాయిలు చెల్లించకపోవడంతో వేలం వేయాలని నిర్ణయించారు. డిసెంబర్ 20న వేలం వేయనున్నట్లు ప్రకటించాయి బ్యాంకులు. […]
టీడీపీ అధినేత చంద్రబాబు సన్నిహితుల ఆస్తుల వేలానికి రంగం సిద్ధమైంది. మాజీ మంత్రి, విశాఖ నార్త్ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆస్తిని వేలం వేయనున్నట్లు బ్యాంకులు ప్రకటన విడుదల చేశాయి.
ప్రత్యూష ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పేర ఇండియన్ బ్యాంక్ నుంచి భారీ రుణం తీసుకుని ఎగవేసిన కేసులో ఇప్పటికే బ్యాంకులు నోటీసులు జారీ చేశాయి. గంటా సకాలంలో బకాయిలు చెల్లించకపోవడంతో వేలం వేయాలని నిర్ణయించారు. డిసెంబర్ 20న వేలం వేయనున్నట్లు ప్రకటించాయి బ్యాంకులు.
గంటా శ్రీనివాసరావు తీసుకున్న మొత్తం రుణం విలువ సుమారు 209 కోట్ల రూపాయలు. తనఖా పెట్టిన ఆస్తుల విలువ 35 కోట్ల 35 లక్షల రూపాయలు. దీంతో మిగతా బాకీ వసూలు కోసం వ్యక్తిగత ఆస్తులను కూడా స్వాధీనం చేసుకునే హక్కు తమకు ఉందని బ్యాంకులు చెబుతున్నాయి. ప్రభుత్వ భూములు తనఖా పెట్టి భారీగా రుణాలు తీసుకున్నారని గతంలో గంటాపై ఆరోపణలు వచ్చాయి.
మరోవైపు చంద్రబాబుకు కరకట్ట గెస్ట్ హౌస్ ను కట్టబెట్టిన లింగమనేని రమేష్‌కు సంబంధించి ఎల్ఈపీఎల్ ప్రాజెక్టు లిమిటెడ్‌కు కూడా బ్యాంకులు నోటీసులు జారీ చేశాయి. డిసెంబర్ 12 లోపు బకాయిలు చెల్లించకపోతే ఆస్తుల స్వాధీనానికి బ్యాంకు పబ్లిక్ నోటీసు ఇచ్చింది.
ఒక్కో టీడీపీ నేత ఇప్పటికే బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టి దొరికిపోతున్నారు. దీంతో ఈ నేతలంతా ఇప్పుడు తమ జప్తుల నుంచి తప్పించుకునేందుకు బీజేపీలో చేరేందుకు పావులు కదుపుతున్నారు. గత రెండువారాలుగా గంటా బీజేపీలో చేరుతారని లీక్‌లు ఇందులో భాగంగానే వచ్చాయని విశాఖలో జనాలు మాట్లాడుకుంటున్నారు. తన ఆస్తులు కాపాడుకునేందుకు గంటా ఈ ప్లాన్ వేశారని గుసగుసలు విన్పిస్తున్నాయి.