Telugu Global
NEWS

డే-నైట్ టెస్టుకు కోల్ కతా ముస్తాబు

హాట్ కేకుల్లా డే-నైట్ టెస్ట్ టికెట్లు టెస్ట్ క్రికెట్ కు గులాబీశోభ భారత గడ్డపై మొట్టమొదటి డే-నైట్ టెస్ట్ మ్యాచ్ కు వేదికగా ఉన్న కోల్ కతా సకలహంగులతో ముస్తాబవుతోంది. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నేతృత్వంలో భారత క్రికెట్ మక్కాఈడెన్ గార్డెన్స్ లో పండుగ వాతావరణం సంతరించుకొంది. నవంబర్ 22 నుంచి ఐదురోజులపాటు జరిగే ఈ మ్యాచ్ కోసం బెంగాల్ క్రికెట్ సంఘం భారీస్థాయిలో ఏర్పాటు చేసింది. బెంగాల్ క్రికెట్ సంఘం చైర్మన్ సౌరవ్ గంగూలీ.. ఈడెన్ గార్డెన్స్ […]

డే-నైట్ టెస్టుకు కోల్ కతా ముస్తాబు
X
  • హాట్ కేకుల్లా డే-నైట్ టెస్ట్ టికెట్లు
  • టెస్ట్ క్రికెట్ కు గులాబీశోభ

భారత గడ్డపై మొట్టమొదటి డే-నైట్ టెస్ట్ మ్యాచ్ కు వేదికగా ఉన్న కోల్ కతా సకలహంగులతో ముస్తాబవుతోంది. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నేతృత్వంలో భారత క్రికెట్ మక్కాఈడెన్ గార్డెన్స్ లో పండుగ వాతావరణం సంతరించుకొంది.

నవంబర్ 22 నుంచి ఐదురోజులపాటు జరిగే ఈ మ్యాచ్ కోసం బెంగాల్ క్రికెట్ సంఘం భారీస్థాయిలో ఏర్పాటు చేసింది. బెంగాల్ క్రికెట్ సంఘం చైర్మన్ సౌరవ్ గంగూలీ.. ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన కార్యక్రమంలో మ్యాచ్ మాస్కాట్లను విడుదల చేశారు.

ఈడెన్ గార్డెన్స్ పరిసరాలతో పాటు కోల్ కతా నగరాన్ని..పింక్ బాల్ రంగుతో …ఎక్కడ చూసినా గులాబీ రంగు శోభతో మెరిసిపోయేలా జాగ్రత్తలు తీసుకొంటున్నారు.

హాట్ కేకుల్లా టికెట్ల సేల్…

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద క్రికెట్ వేదికగా ఉన్న ఈడెన్ గార్డెన్స్ లో జరిగే డే-నైట్ టెస్ట్ మొదటి మూడురోజుల ఆటకు …రోజుకు 65వేల మంది చొప్పున అభిమానులు హాజరుకానున్నారని సౌరవ్ గంగూలీ ప్రకటించారు.

అందరూ మ్యాచ్ చూడాలన్న లక్ష్యంతో కనీస టికెట్ ధరను రోజుకు 50 రూపాయలుగా నిర్ణయించినట్లు తెలిపారు. లక్షమంది కూర్చొని ఒకేసారి మ్యాచ్ చూడటానికి ఈడెన్ గార్డెన్స్ లో వీలుంది.

స్టేడియంలో భారీగా అభిమానులుండటం విరాట్ కొహ్లీ అండ్ కోకు బోనస్ లాంటిందని సౌరవ్ తెలిపారు. స్టేడియంలో ఏర్పాటు చేసిన భారీ గంటను బంగ్లా ప్రధాని షేక్ హసీనా, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కలసి మోగించడం ద్వారా మ్యాచ్ ను ప్రారంభిస్తారని చెప్పారు.

ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండుమ్యాచ్ ల సిరీస్ మొదటి టెస్టును కేవలం మూడురోజుల్లోనే ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో నెగ్గడం ద్వారా భారత్ 1-0తో పైచేయి సాధించింది.

First Published:  18 Nov 2019 4:37 AM IST
Next Story