Telugu Global
NEWS

రొనాల్డో ఖాతాలో 99వ గోల్

2020 యూరో సాకర్ కు పోర్చుగల్ అర్హత వచ్చే ఏడాది జరిగే యూరోపియన్ ఫుట్ బాల్ టోర్నీకి డిఫెండింగ్ చాంపియన్ పోర్చుగల్ అర్హత సంపాదించింది. స్టార్ స్ట్రయికర్ కమ్ కెప్టెన్ క్రిస్టియానా రొనాల్డో.. పోర్చుగల్ తరపున 99వ గోల్ చేయడం ద్వారా తనజట్టు విజయంలో ప్రధానపాత్ర వహించాడు. ఇటలీ వేదికగా 2020 జూన్ 12న ప్రారంభంకానున్న యూరోపియన్ ఫుట్ బాల్ ఫైనల్ రౌండ్ కు మాజీ చాంపియన్లు నెదర్లాండ్స్, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, ఇంగ్లండ్ జట్లు అర్హత సాధించగా..ఇప్పుడు పోర్చుగల్ […]

రొనాల్డో ఖాతాలో 99వ గోల్
X
  • 2020 యూరో సాకర్ కు పోర్చుగల్ అర్హత

వచ్చే ఏడాది జరిగే యూరోపియన్ ఫుట్ బాల్ టోర్నీకి డిఫెండింగ్ చాంపియన్ పోర్చుగల్ అర్హత సంపాదించింది. స్టార్ స్ట్రయికర్ కమ్ కెప్టెన్ క్రిస్టియానా రొనాల్డో.. పోర్చుగల్ తరపున 99వ గోల్ చేయడం ద్వారా తనజట్టు విజయంలో ప్రధానపాత్ర వహించాడు.

ఇటలీ వేదికగా 2020 జూన్ 12న ప్రారంభంకానున్న యూరోపియన్ ఫుట్ బాల్ ఫైనల్ రౌండ్ కు మాజీ చాంపియన్లు నెదర్లాండ్స్, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, ఇంగ్లండ్ జట్లు అర్హత సాధించగా..ఇప్పుడు పోర్చుగల్ సైతం బెర్త్ ఖాయం చేసుకొంది. పోర్చుగల్ అర్హతతో యూరోసాకర్ మెయిన్ రౌండ్ కు చేరిన జట్ల సంఖ్య 17కు చేరింది.

గోల్స్ సెంచరీకి చేరువగా క్రిస్టియానా..

ప్రపంచ సాకర్ సూపర్ స్టార్స్, గోల్స్ యంత్రం క్రిస్టియానో రొనాల్డో తన కెరియర్ లో …పోర్చుగల్ జట్టులో సభ్యుడిగా 99వ గోల్ సాధించాడు. లగ్జెంబర్గ్ తో జరిగిన మ్యాచ్ లో బ్రూనో ఫెర్నాండేజ్, క్రిస్టియానో రొనాల్డో చెరో గోలు సాధించడం ద్వారా తమ జట్టుకు యూరో బెర్త్ ఖాయం చేయగలిగారు.

ప్రపంచ సాకర్ చరిత్రలో ఓ జాతీయజట్టు తరపున అత్యధిక గోల్స్ సాధించిన రికార్డు ఇరాన్ మాజీ స్ట్రయికర్ అలీ దాయి పేరుతో ఉంది. అలీ మొత్తం 109 గోల్స్ సాధించడం ద్వారా అగ్రస్థానంలో నిలిస్తే…రొనాల్డో 99 గోల్స్ తో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

తన ఫుట్ బాల్ కెరియర్ లోనే 700 గోల్స్ సాధించిన తొలి ప్లేయర్ గా గుర్తింపు పొందిన క్రిస్టియానో రొనాల్డో పోర్చుగల్ తరపున గోల్స్ సెంచరీకి ఎదురుచూస్తున్నాడు.

First Published:  18 Nov 2019 3:06 AM IST
Next Story