Telugu Global
NEWS

ఏటీపీ టూర్ ఫైనల్స్ టైటిల్ ఫైట్ కు కౌంట్ డౌన్

జ్వెరేవ్ కు సిటిస్ పాస్ థీమా సవాల్ ఏటీపీ టూర్ 2019 సీజన్ ముగింపు టోర్నీ ఫైనల్స్ కు లండన్ లో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. ప్రపంచ టెన్నిస్ మొదటి ఎనిమిదిమంది అత్యుత్తమ ర్యాంక్ ప్లేయర్ల నడుమ జరిగిన ఈ టోర్నీలో నడాల్, జోకోవిచ్, ఫెదరర్, జ్వెరేవ్ లాంటి మేటి ఆటగాళ్లు లీగ్ దశ నుంచే నిష్క్ర్రమించగా…గ్రీకు వీరుడు స్టెఫానోస్ సిటిసి పాస్, డోమినిక్ థీమ్ టైటిల్ సమరానికి అర్హత సాధించారు. తొలిసెమీఫైనల్లో ఆరుసార్లు విజేత రోజర్ […]

ఏటీపీ టూర్ ఫైనల్స్ టైటిల్ ఫైట్ కు కౌంట్ డౌన్
X
  • జ్వెరేవ్ కు సిటిస్ పాస్ థీమా సవాల్

ఏటీపీ టూర్ 2019 సీజన్ ముగింపు టోర్నీ ఫైనల్స్ కు లండన్ లో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది.

ప్రపంచ టెన్నిస్ మొదటి ఎనిమిదిమంది అత్యుత్తమ ర్యాంక్ ప్లేయర్ల నడుమ జరిగిన ఈ టోర్నీలో నడాల్, జోకోవిచ్, ఫెదరర్, జ్వెరేవ్ లాంటి మేటి ఆటగాళ్లు లీగ్ దశ నుంచే నిష్క్ర్రమించగా…గ్రీకు వీరుడు స్టెఫానోస్ సిటిసి పాస్, డోమినిక్ థీమ్
టైటిల్ సమరానికి అర్హత సాధించారు.

తొలిసెమీఫైనల్లో ఆరుసార్లు విజేత రోజర్ ఫెదరర్ ను స్టెపానోస్ సిటిస్ పాస్ వరుససెట్లలో కంగు తినిపించగా…రెండో సెమీస్ లో డిఫెండింగ్ చాంపియన్ అలెగ్జాండర్ జ్వెరేవ్ ను 7-5, 6-3తో డోమనిక్ థీమ్ ను అధిగమించాడు.

ఏటీపీ టూర్ పైనల్స్ చేరడం సిటిస్ పాస్, థీమ్ లకు ఇదే మొదటిసారి.

First Published:  18 Nov 2019 3:09 AM IST
Next Story