కెప్టెన్ కొహ్లీ సరికొత్త రికార్డు
ధోనీరికార్డును అధిగమించిన కొహ్లీ ఇన్నింగ్స్ విజయాలు సాధించడంలో కెప్టెన్ విరాట్ కొహ్లీ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఇండోర్ లోని హోల్కార్ స్టేడియం వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన తొలిటెస్ట్ ను మూడురోజుల ఆటలోనే ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో భారత్ నెగ్గడం ద్వారా కొహ్లీ ఈ ఘనత సాధించాడు. విరాట్ కొహ్లీ సారథిగా భారత్ కు ఇది 10వ ఇన్నింగ్స్ విజయం కావడం విశేషం. భారత క్రికెట్లో ఇప్పటి వరకూ అత్యధికంగా 9 ఇన్నింగ్స్ విజయాలు సాధించిన రికార్డు […]
- ధోనీరికార్డును అధిగమించిన కొహ్లీ
ఇన్నింగ్స్ విజయాలు సాధించడంలో కెప్టెన్ విరాట్ కొహ్లీ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఇండోర్ లోని హోల్కార్ స్టేడియం వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన తొలిటెస్ట్ ను మూడురోజుల ఆటలోనే ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో భారత్ నెగ్గడం ద్వారా కొహ్లీ ఈ ఘనత సాధించాడు.
విరాట్ కొహ్లీ సారథిగా భారత్ కు ఇది 10వ ఇన్నింగ్స్ విజయం కావడం విశేషం. భారత క్రికెట్లో ఇప్పటి వరకూ అత్యధికంగా 9 ఇన్నింగ్స్ విజయాలు సాధించిన రికార్డు మహేంద్రసింగ్ ధోనీ పేరుతోనే ఉంది.
మహ్మద్ అజరుద్దీన్ కెప్టెన్ గా 8, సౌరవ్ గంగూలీ నాయకత్వంలో 7 ఇన్నింగ్స్ విజయాల రికార్డులు ఉన్నాయి.
లీగ్ టేబుల్ టాపర్ భారత్…
ఐసీసీ తొలిసారిగా నిర్వహిస్తున్న టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో…టాప్ ర్యాంకర్ భారత్ టేబుల్ టాపర్ గా నిలిచింది. పది జట్ల లీగ్ లో భారత్ ప్రస్తుత బంగ్లా టెస్ట్ వరకూ ఆడిన ఆరుకు ఆరుమ్యాచ్ లూ నెగ్గి 300 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
ఇప్పటికే స్వదేశీ సిరీస్ ల్లో వరుసగా 11 విజయాలతో ప్రపంచ రికార్డు నెలకొల్పిన భారత్…బంగ్లాదేశ్ పైనా 2-0 తో సిరీస్ నెగ్గడం ద్వారా తన రికార్డును తానే మెరుగుపరచుకోవాలన్న పట్టుదలతో ఉంది.