వంశీని స్వతంత్ర ఎమ్మెల్యేగా గుర్తించవచ్చు " ఏపీ స్పీకర్
టీడీపీ నాయకత్వంపై తిరగుబాటు చేసిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహారంపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. ఏ ఎమ్మెల్యే అయినా పార్టీ మారాలనుకుంటే సభ్యత్వానికి రాజీనామా చేయాల్సిందేనన్నారు. అలా చేయకుండా పార్టీ మారితే అనర్హత వేటు వేస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిది, తనది ఒకే విధానమని స్పీకర్ వివరించారు. వల్లభనేని వంశీని టీడీపీ నుంచి సస్పెండ్ చేస్తారా?, లేక బహిష్కరిస్తారా? అన్నది ఆ పార్టీ వ్యవహరమని అభిప్రాయపడ్డారు. ఒకవేళ […]
టీడీపీ నాయకత్వంపై తిరగుబాటు చేసిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహారంపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. ఏ ఎమ్మెల్యే అయినా పార్టీ మారాలనుకుంటే సభ్యత్వానికి రాజీనామా చేయాల్సిందేనన్నారు. అలా చేయకుండా పార్టీ మారితే అనర్హత వేటు వేస్తామని స్పష్టం చేశారు.
ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిది, తనది ఒకే విధానమని స్పీకర్ వివరించారు. వల్లభనేని వంశీని టీడీపీ నుంచి సస్పెండ్ చేస్తారా?, లేక బహిష్కరిస్తారా? అన్నది ఆ పార్టీ వ్యవహరమని అభిప్రాయపడ్డారు.
ఒకవేళ వల్లభనేని వంశీని టీడీపీ సస్పెండ్ చేస్తే… ఆయన మరో పార్టీలో చేరకుండా ఉంటే స్వతంత్ర ఎమ్మెల్యేగా గుర్తించేందుకు వీలుంటుందన్నారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో అందరికీ ఒకే సూత్రం వర్తిస్తుందని చెప్పారు.
వంశీ నేరుగా వైసీపీలో చేరాలనుకుంటే మాత్రం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుందన్నారు. డిసెంబర్ 2 నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు.