Telugu Global
NEWS

నాలుగుమాసాల తర్వాత బ్యాట్ పట్టిన ధోనీ

విండీస్ తో సిరీస్ కు అందుబాటులో లేని మహీ క్రికెట్ కు గత 130 రోజులుగా దూరంగా ఉన్న భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ తిరిగి ప్రాక్టీసు మొదలుపెట్టాడు. రాంచీ లోని జార్ఖండ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో సాధన మొదలుపెట్టాడు. ఇంగ్లండ్ వేదికగా ముగిసిన వన్డే ప్రపంచకప్ సెమీస్ లో న్యూజిలాండ్ తో తన ఆఖరి మ్యాచ్ ఆడిన తర్వాత… తనకు తానుగా క్రికెట్ కు దూరమై… నెలరోజుల పాటు.. భారత సైనికదళాలలో సైనికుడుగా పనిచేసిన ధోనీ… […]

నాలుగుమాసాల తర్వాత బ్యాట్ పట్టిన ధోనీ
X
  • విండీస్ తో సిరీస్ కు అందుబాటులో లేని మహీ

క్రికెట్ కు గత 130 రోజులుగా దూరంగా ఉన్న భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ తిరిగి ప్రాక్టీసు మొదలుపెట్టాడు. రాంచీ లోని జార్ఖండ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో సాధన మొదలుపెట్టాడు.

ఇంగ్లండ్ వేదికగా ముగిసిన వన్డే ప్రపంచకప్ సెమీస్ లో న్యూజిలాండ్ తో తన ఆఖరి మ్యాచ్ ఆడిన తర్వాత… తనకు తానుగా క్రికెట్ కు దూరమై… నెలరోజుల పాటు.. భారత సైనికదళాలలో సైనికుడుగా పనిచేసిన ధోనీ… నాలుగుమాసాల విరామం తర్వాత నెట్ ప్రాక్టీస్ కు సిద్ధమయ్యాడు.

అయితే…డిసెంబర్ 6 నుంచి ముంబై వేదికగా విండీస్ తో ప్రారంభమయ్యే టీ-20 సిరీస్ కు మాత్రం ధోనీ అందుబాటులో లేడని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పటికే టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ… మొత్తంగా క్రికెట్ కే గుడ్ బై చెప్పనున్నాడన్న ప్రచారం జోరందుకొన్నా…ఈ దిగ్గజ క్రికెటర్ మాత్రం పెదవివిప్పకుండా గడుపుతూ వచ్చాడు.

ఆస్ట్ర్రేలియావేదికగా వచ్చే ఏడాది జరిగే టీ-20 ప్రపంచకప్ తర్వాత ధోనీ పూర్తిగా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

First Published:  15 Nov 2019 9:30 PM GMT
Next Story