Telugu Global
NEWS

తప్పనిసరిగా రావాలని ఫోన్‌.... అయినా 10 మంది ఎమ్మెల్యేలు డుమ్మా

చంద్రబాబు నిర్వహించిన ఇసుక దీక్ష వల్ల టీడీపీకి అనుకున్న ఫలితం సంగతి ఎలా ఉన్నా… ఆ పార్టీకి పొంచి ఉన్న సంక్షోభాన్ని ఎత్తిచూపింది. చంద్రబాబు దీక్షకు 22 మంది ఎమ్మెల్యేల్లో కేవలం 8మంది మాత్రమే హాజరయ్యారు. మిగిలిన ఎమ్మెల్యేలు అటువైపు కూడా చూడలేదు. వచ్చిన ఎమ్మెల్యేలు కూడా కేవలం వేదికపై కొద్దిసేపు మాత్రమే ఉండి హాజరువేయించుకుని వెళ్లిపోయారు. దీక్షకు ఇలా 15మంది ఎమ్మెల్యేలు రాకపోవడంతో చంద్రబాబు జరుగుతున్న పరిణామాలపై ఆరా తీశారు. శుక్రవారం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో […]

తప్పనిసరిగా రావాలని ఫోన్‌.... అయినా 10 మంది ఎమ్మెల్యేలు డుమ్మా
X

చంద్రబాబు నిర్వహించిన ఇసుక దీక్ష వల్ల టీడీపీకి అనుకున్న ఫలితం సంగతి ఎలా ఉన్నా… ఆ పార్టీకి పొంచి ఉన్న సంక్షోభాన్ని ఎత్తిచూపింది. చంద్రబాబు దీక్షకు 22 మంది ఎమ్మెల్యేల్లో కేవలం 8మంది మాత్రమే హాజరయ్యారు. మిగిలిన ఎమ్మెల్యేలు అటువైపు కూడా చూడలేదు. వచ్చిన ఎమ్మెల్యేలు కూడా కేవలం వేదికపై కొద్దిసేపు మాత్రమే ఉండి హాజరువేయించుకుని వెళ్లిపోయారు.

దీక్షకు ఇలా 15మంది ఎమ్మెల్యేలు రాకపోవడంతో చంద్రబాబు జరుగుతున్న పరిణామాలపై ఆరా తీశారు. శుక్రవారం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తప్పనిసరిగా హాజరుకావాల్సిందేనని ఎమ్మెల్యేలకు ఫోన్లు చేశారు. కానీ చంద్రబాబు నిర్వహించిన సమీక్షకు కూడా కేవలం 10 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. ఒకరిద్దరు వ్యక్తిగత కారణాలతో రాలేకపోయినా మిగిలిన ఎమ్మెల్యేలు కావాలనే చంద్రబాబు ఆదేశాలను లైట్‌ తీసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఫోన్లు చేసి తప్పనిసరిగా సమావేశానికి రావాల్సిందేనని ఆదేశించినా సరే ఎమ్మెల్యేలు రాకపోవడం రాబోయే ప్రమాదానికి సూచికగా టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. కొందరు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్న ప్రచారం కూడా జరుగుతుండడంతో ఎమ్మెల్యేలతో వ్యక్తిగతంగా చర్చలు జరిపేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు. ప్రత్యేకంగా పిలిచి వారి అవసరాలు, ఇబ్బందులు తెలుసుకుని వాటిని పరిష్కరించడం ద్వారా ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నం చేయవచ్చని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.

First Published:  16 Nov 2019 5:18 AM IST
Next Story