Telugu Global
NEWS

ఇంగ్లీష్ ప్రవేశపెడితే తప్పేంటి? పవన్ వ్యాఖ్యలు సరికాదు...

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే తప్పేంటని ప్రశ్నించారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. ఈ విషయం పై ఇంత రాద్దాంతం ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు సబ్జెక్ట్‌ను తప్పనిసరి చేస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పుడు…. తెలుగు భాషకు వచ్చిన ఇబ్బంది ఏమీ ఉండదన్నారు. కార్పొరేట్, ప్రైవేట్‌ పాఠశాలల్లో కూడా తెలుగు సబ్జెక్ట్‌ను తప్పనిసరి చేయాలన్నారు. తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివించేందుకు తల్లిదండ్రులే ఇష్టపడుతుంటే మధ్యవారికి అభ్యంతరం ఎందుకని […]

ఇంగ్లీష్ ప్రవేశపెడితే తప్పేంటి? పవన్ వ్యాఖ్యలు సరికాదు...
X

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే తప్పేంటని ప్రశ్నించారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. ఈ విషయం పై ఇంత రాద్దాంతం ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.

ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు సబ్జెక్ట్‌ను తప్పనిసరి చేస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పుడు…. తెలుగు భాషకు వచ్చిన ఇబ్బంది ఏమీ ఉండదన్నారు. కార్పొరేట్, ప్రైవేట్‌ పాఠశాలల్లో కూడా తెలుగు సబ్జెక్ట్‌ను తప్పనిసరి చేయాలన్నారు.

తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివించేందుకు తల్లిదండ్రులే ఇష్టపడుతుంటే మధ్యవారికి అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు ఉండవల్లి. కాబట్టి ప్రభుత్వ నిర్ణయంపై అనవసర రాద్దాంతం చేయాల్సిన పనిలేదన్నారు. రాష్ట్రంలో అవినీతిరహిత పాలన అందించేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోందన్నారు.

ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే మరో మతాన్ని ప్రోత్సహించడం అంటే అర్థం ఉందా అని ప్రశ్నించారు. అసలు మతాల గురించి తెలియని వారు కూడా ఏదేదో మాట్లాడుతున్నారన్నారు. విమర్శలు చేస్తున్న వారికి హిందూమతం గురించి తెలుసా అని ప్రశ్నించారు. ఏ విధానాన్ని అయినా, ఎవరినైనా ఆదరించడం హిందుత్వానికి ఉన్న గొప్పతనమన్నారు.. ప్రపంచంలోనే హిందుత్వ విధానానికి మించినది లేదన్నారు. ఈ గొప్పతనం నుంచి పక్కకుపోయి ఇతర మతాలను కించపరిచేలా మాట్లాడుకోవడం సరికాదన్నారు.

పెద్దవాళ్లంతా వారి పిల్లలను మరి ఇంగ్లీష్‌లో ఎందుకు చదివిస్తున్నారని ప్రశ్నించారు. పెద్దలు వారి పిల్లలకు ఇంగ్లీష్ చదివిస్తూ ఇప్పుడు పేద పిల్లల కోసం ప్రభుత్వ పాఠశాల్లో ఇంగ్లీష్‌ తెస్తామంటే దానిపై అభ్యంతరం చెప్పడంలో అర్థమే లేదన్నారు. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపడితే మట్టిలో కలిసిపోతారని పవన్‌ కల్యాణ్ అనడం చాలా తీవ్రస్థాయికి వెళ్లడమేనని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. డబ్బు తీసుకుని జగన్ పనిచేస్తున్నారని ఇప్పటి వరకు ఏ ఒక్కరూ అనలేదన్నారు. ఏసీబీ కూడా యాక్టివ్‌ అవుతోందని…. అది మంచిపరిణామమేనన్నారు.

First Published:  15 Nov 2019 2:14 AM IST
Next Story