Telugu Global
NEWS

ఆమ్రపాలికి భూమి కేటాయించిన తెలంగాణ సర్కార్‌.... అయితే....

వరంగల్‌ జిల్లా మాజీ కలెక్టర్ ఆమ్రపాలికి తెలంగాణ సర్కార్‌ భూమి కేటాయించింది. 1,210 గజాల భూమిని ఇచ్చింది. ఆమ్రపాలి ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌ రెడ్డికి ప్రైవేట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. మొన్నటి దాకా ఎన్నికల సంఘం ఆఫీసులో పనిచేశారు. ఆమ్రపాలి తల్లి పద్మావతికి వికారాబాద్‌ దగ్గరలోని కొత్తరపల్లిలో 4 ఎకరాల 27 గుంటల భూమి ఉంది. ఈ భూమికి రోడ్డు లేదు. పక్కనే ప్రభుత్వ భూమి ఉంది. దీంతో ఈ భూమికి అప్రోచ్‌ రోడ్డు వేసేందుకు […]

ఆమ్రపాలికి భూమి కేటాయించిన తెలంగాణ సర్కార్‌.... అయితే....
X

వరంగల్‌ జిల్లా మాజీ కలెక్టర్ ఆమ్రపాలికి తెలంగాణ సర్కార్‌ భూమి కేటాయించింది. 1,210 గజాల భూమిని ఇచ్చింది.

ఆమ్రపాలి ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌ రెడ్డికి ప్రైవేట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. మొన్నటి దాకా ఎన్నికల సంఘం ఆఫీసులో పనిచేశారు.

ఆమ్రపాలి తల్లి పద్మావతికి వికారాబాద్‌ దగ్గరలోని కొత్తరపల్లిలో 4 ఎకరాల 27 గుంటల భూమి ఉంది. ఈ భూమికి రోడ్డు లేదు. పక్కనే ప్రభుత్వ భూమి ఉంది. దీంతో ఈ భూమికి అప్రోచ్‌ రోడ్డు వేసేందుకు భూమి కేటాయించాలని ప్రభుత్వాన్ని ఆమ్రపాలి కోరింది. ఈ మేరకు ప్రభుత్వానికి అప్లికేషన్‌ పెట్టుకుంది.

దీనిపై స్పందించిన ప్రభుత్వం….ఆమెకు 1,210 గజాలను కేటాయించింది. అయితే ఇందుకోసం నాలుగు లక్షల రూపాయలను చెల్లించాలని సూచించింది.

ఈమేరకు ఆమ్రపాలికి భూమి కేటాయిస్తూ రెవెన్యూ ముఖ్య కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు.

First Published:  15 Nov 2019 4:54 AM GMT
Next Story