బీజేపీ-జనసేన కలవబోతున్నాయా? అమిత్ షాతో భేటికి పవన్
మొన్నటివరకు బీజేపీ మోసాన్ని ఎలుగెత్తిచాటి ఆంధ్రాకు అన్యాయం చేసిందని తిట్టిపోసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అదే పార్టీతో చేతులు కలుపబోతున్నాడా అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో సమావేశానికి సిద్ధమైనట్లు సమాచారం. ఏపీలో టీడీపీ, వైసీపీకి ప్రత్యామ్మాయంగా ఎదగాలనుకుంటున్న బీజేపీ ఇప్పుడు సరైన నేత కోసం అన్వేషిస్తోంది. జనసేనను బీజేపీలో విలీనం చేస్తే బీజేపీ ఏపీ పగ్గాలు అప్పగించేందుకు అమిత్ షా రెడీగా […]
మొన్నటివరకు బీజేపీ మోసాన్ని ఎలుగెత్తిచాటి ఆంధ్రాకు అన్యాయం చేసిందని తిట్టిపోసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అదే పార్టీతో చేతులు కలుపబోతున్నాడా అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో సమావేశానికి సిద్ధమైనట్లు సమాచారం.
ఏపీలో టీడీపీ, వైసీపీకి ప్రత్యామ్మాయంగా ఎదగాలనుకుంటున్న బీజేపీ ఇప్పుడు సరైన నేత కోసం అన్వేషిస్తోంది.
జనసేనను బీజేపీలో విలీనం చేస్తే బీజేపీ ఏపీ పగ్గాలు అప్పగించేందుకు అమిత్ షా రెడీగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.
తాజాగా పవన్ ఢిల్లీలో అమిత్ షాను కలిస్తే మీటింగ్ సారాంశం ఇదేనన్న చర్చ సాగుతోంది. అమెరికాలోని తానా సభల్లో ఈ మేరకు బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్ పవన్ తో చర్చలు జరిపినట్టు వార్తలు వచ్చాయి. పవన్ దీనికి అంగీకరించబోతున్నట్టు సమాచారం.
ఏపీలో మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో జనసేన ఘోరంగా ఓడిపోయింది. పవన్ సైతం రెండు స్థానాల్లో పోటీచేసి ఓడిపోయారు. ఇప్పుడు వైసీపీ, టీడీపీని దాటి జనసేన ముందుకెళ్లే అవకాశాలు లేవు. అందుకే బీజేపీలో చేరి ఆ పార్టీ అండదండలతో ఏపీలో రాజకీయ నేతగా ఎదగాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. మరి ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి.