Telugu Global
National

మూడు కీలక కేసుల్లో సుప్రీం తీర్పులు...

మోడీ సర్కారు దేశ రక్షణ కోసం కొనుగోలు చేసిన ‘రాఫెల్’ యుద్ధ విమానాల కొనుగోల్ మాల్ పై ప్రతిపక్ష కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. మోడీ సర్కారు అవినీతికి పాల్పడిందని ఆరోపించింది. దీనిపై సుప్రీం కోర్టుకు ఎక్కారు. రాఫెల్ డీల్ పై సీబీఐ విచారణ చేయాలని… అవినీతి జరిగిందని దాఖలైన రివ్యూ పిటీషన్లను గురువారం సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఇక కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ గత ఎన్నికల వేళ […]

మూడు కీలక కేసుల్లో సుప్రీం తీర్పులు...
X

మోడీ సర్కారు దేశ రక్షణ కోసం కొనుగోలు చేసిన ‘రాఫెల్’ యుద్ధ విమానాల కొనుగోల్ మాల్ పై ప్రతిపక్ష కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. మోడీ సర్కారు అవినీతికి పాల్పడిందని ఆరోపించింది. దీనిపై సుప్రీం కోర్టుకు ఎక్కారు. రాఫెల్ డీల్ పై సీబీఐ విచారణ చేయాలని… అవినీతి జరిగిందని దాఖలైన రివ్యూ పిటీషన్లను గురువారం సుప్రీం కోర్టు కొట్టివేసింది.

ఇక కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ గత ఎన్నికల వేళ మోడీని ఉద్దేశించి ‘చౌకీదార్ చోర్’ అని ఆరోపించడం కలకలం రేపింది. దీనిపై సుప్రీం కోర్టులో బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి పిటీషన్ దాఖలు చేసింది. దీనిపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. సుప్రీం కోర్టును కూడా రాహుల్ తప్పుపట్టడంపై మండిపడింది. ఆ తర్వాత రాహుల్ పై కోర్టు ధిక్కరణ కేసును సుప్రీం పెట్టింది.. రాహుల్ గాంధీ సుప్రీం కోర్టుకు క్షమాపణ చెప్పడంతో ఈ కోర్టు ధిక్కరణ కేసును తాజాగా కొట్టివేస్తున్నట్టు ప్రకటించింది. రాహుల్ కు ఉపశమనం కలిగించింది.

రాఫెల్ డీల్ పై సీబీఐ విచారణ అవసరం లేదని.. రాఫెల్ పై ఇక కోర్టు పర్యవేక్షణ అవసరం లేదని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది.

ఇక శబరిమల లో మహిళల ప్రవేశంపై తీర్పు విషయంలో ఐదుగురు జడ్జీల మధ్య భేదాభిప్రాయలు వచ్చాయి. 3-2తో తీర్పుపై ప్రతిష్టంభన నెలకొంది. దీంతో దీన్ని విస్తృత ధర్మాసనానికి సుప్రీం కోర్టు బదిలీ చేసింది. ఇలా ఒకేరోజు మూడు అంశాలపై సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఒక్క శబరిమల వివాదంపైనే ఏకాభిప్రాయం కుదరక వాయిదా పడింది.

First Published:  14 Nov 2019 12:52 AM GMT
Next Story