Telugu Global
NEWS

జనవరిలో ఏపీ స్థానిక ఎన్నికలు

జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి వివరించారు. అమ్మ ఒడి పథకం అమలు పూర్తయిన తర్వాత ఎన్నికలు నిర్వహించబోతున్నారు. మేనిఫెస్టోలో చెప్పిన పథకాలన్నింటినీ అమలు చేసిన తర్వాత స్థానిక ఎన్నికలకు వెళ్లే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఉన్నట్టు కేబినెట్‌ భేటీలో సంకేతాలిచ్చారు. ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టే విషయంలో వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని సీఎం స్పష్టం చేశారు. ఇంగ్లీష్ చదువులు కేవలం ధనికులకు మాత్రమేనా… […]

జనవరిలో ఏపీ స్థానిక ఎన్నికలు
X

జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి వివరించారు. అమ్మ ఒడి పథకం అమలు పూర్తయిన తర్వాత ఎన్నికలు నిర్వహించబోతున్నారు.

మేనిఫెస్టోలో చెప్పిన పథకాలన్నింటినీ అమలు చేసిన తర్వాత స్థానిక ఎన్నికలకు వెళ్లే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఉన్నట్టు కేబినెట్‌ భేటీలో సంకేతాలిచ్చారు.

ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టే విషయంలో వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని సీఎం స్పష్టం చేశారు. ఇంగ్లీష్ చదువులు కేవలం ధనికులకు మాత్రమేనా… పేదల పిల్లలకు ఆ అవకాశం దక్కకూడదా అని ప్రశ్నించారు. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ బోర్డులతో మన విద్యార్థులు పోటీపడాలంటే ఇంగ్లిష్‌ మీడియం తప్పనిసరి అని అభిప్రాయపడ్డారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కుమార్తె, రామోజీరావు సతీమణి, టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలలు ఇంగ్లిష్‌ మీడియంలో కాదా అని ప్రశ్నించారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే వైసీపీ నేతలైనా సరే చర్యలు తప్పవని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇసుకపై చంద్రబాబు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలని మంత్రులకు సూచించారు.

ఔట్‌ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ విషయంలో మంత్రులు జోక్యం చేసుకోవద్దని.. అది మంత్రుల పని కాదని సీఎం స్పష్టం చేశారు. ఔట్‌ సోర్సింగ్ ఉద్యోగులను పారదర్శకంగా నియమించే అధికారాన్ని కలెక్టర్లు, శాఖాధిపతులకు అప్పగిస్తున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు.

First Published:  14 Nov 2019 3:02 AM IST
Next Story