Telugu Global
NEWS

ప్రణీత్ అప్... కిడాంబీ శ్రీకాంత్ డౌన్

డబుల్స్ 7వ ర్యాంక్ లో భారత జోడీ ప్రపంచ బ్యాడ్మింటన్ పురుషుల ర్యాంకింగ్స్ లో భారత్ కు మిశ్రమఫలితాలు ఎదురయ్యాయి. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్ ప్రకారం… భారత స్టార్ ప్లేయర్ కిడాంబీ శ్రీకాంత్ 13వ స్థానానికి పడిపోగా…సాయి ప్రణీత్ తొలిసారిగా టాప్ -10 ర్యాంకుల్లో చోటు సంపాదించాడు. ఈమధ్య కాలంలో వరుస పరాజయాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న కిడాంబీ శ్రీకాంత్ 7వ ర్యాంక్ నుంచి 13వ ర్యాంక్ కు దిగజారిపోయాడు. మరోవైపు… ప్రపంచ బ్యాడ్మింటన్లో కాంస్య పతకం, స్విస్ […]

ప్రణీత్ అప్... కిడాంబీ శ్రీకాంత్ డౌన్
X
  • డబుల్స్ 7వ ర్యాంక్ లో భారత జోడీ

ప్రపంచ బ్యాడ్మింటన్ పురుషుల ర్యాంకింగ్స్ లో భారత్ కు మిశ్రమఫలితాలు ఎదురయ్యాయి. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్ ప్రకారం… భారత స్టార్ ప్లేయర్ కిడాంబీ శ్రీకాంత్ 13వ స్థానానికి పడిపోగా…సాయి ప్రణీత్ తొలిసారిగా టాప్ -10 ర్యాంకుల్లో చోటు సంపాదించాడు.

ఈమధ్య కాలంలో వరుస పరాజయాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న కిడాంబీ శ్రీకాంత్ 7వ ర్యాంక్ నుంచి 13వ ర్యాంక్ కు దిగజారిపోయాడు.

మరోవైపు… ప్రపంచ బ్యాడ్మింటన్లో కాంస్య పతకం, స్విస్ ఓపెన్ టైటిల్స్ నెగ్గడం ద్వారా సాయి ప్రణీత్ తన ర్యాంక్ ను గణనీయంగా మెరుగుపరచుకొన్నాడు. తనకెరియర్ లోనే తొలిసారిగా పదవ ర్యాంక్ లో నిలిచాడు.

పురుషుల డబుల్స్ లో భారత జోడీ సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి 7వ ర్యాంక్ సాధించారు. థాయ్ లాండ్ ఓపెన్ టైటిల్ తో పాటు ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్ స్థానాలు సాధించడం ద్వారా ..అత్యుత్తమంగా 7వ ర్యాంక్ సాధించగలిగారు.

First Published:  14 Nov 2019 5:34 AM IST
Next Story