Telugu Global
NEWS

భారత ఫుట్ బాల్ జట్టుకు డూ ఆర్ డై

అఫ్ఘనిస్థాన్ తో నేడు భారత్ పోరు ప్రపంచకప్ ఫుట్ బాల్ ఆసియా జోన్ అర్హత పోటీల రెండోరౌండ్లో విజయానికి భారత్ తహతహలాడుతోంది. తజకిస్థాన్ లోని దుషాంబే ఎముకలు కొరికే చలి వాతావరణంలో.. అఫ్ఘనిస్థాన్ తో నేడు జరిగే పోటీ భారత్ కు చావో బతుకో సమరంగా మారింది. జోనల్ గ్రూపు తొలిరౌండ్ పోటీలలో ఒమాన్ చేతిలో ఓడినా…ఖతర్, బంగ్లాదేశ్ జట్లతో మ్యాచ్ లను డ్రాలతో సరిపెట్టుకొన్న భారత జట్టు.. తొలి విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది. గ్రూప్-ఈ లీగ్ లో […]

భారత ఫుట్ బాల్ జట్టుకు డూ ఆర్ డై
X
  • అఫ్ఘనిస్థాన్ తో నేడు భారత్ పోరు

ప్రపంచకప్ ఫుట్ బాల్ ఆసియా జోన్ అర్హత పోటీల రెండోరౌండ్లో విజయానికి భారత్ తహతహలాడుతోంది. తజకిస్థాన్ లోని దుషాంబే ఎముకలు కొరికే చలి వాతావరణంలో.. అఫ్ఘనిస్థాన్ తో నేడు జరిగే పోటీ భారత్ కు చావో బతుకో సమరంగా మారింది.

జోనల్ గ్రూపు తొలిరౌండ్ పోటీలలో ఒమాన్ చేతిలో ఓడినా…ఖతర్, బంగ్లాదేశ్ జట్లతో మ్యాచ్ లను డ్రాలతో సరిపెట్టుకొన్న భారత జట్టు.. తొలి విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది.

గ్రూప్-ఈ లీగ్ లో 2పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచిన భారత్…రెండోరౌండ్లో ఆరునూరైనా అఫ్ఘనిస్థాన్ పై నెగ్గి తీరాల్సి ఉంది. అంతర్జాతీయ ఫుట్ బాల్ సంఘం తాజా ర్యాంకింగ్స్ ప్రకారం 106వ స్థానంలో ఉన్న భారత్ కు…ప్రత్యర్థి 149వ ర్యాంకర్ అఫ్ఘనిస్థాన్ కంటే…దుషాంబే శీతల వాతావరణమే కీలకం కానుంది.

అఫ్ఘన్ జట్టు మాత్రం ఓ గెలుపు, రెండు పరాజయాల రికార్డుతో గ్రూపు మూడో స్థానంలో కొనసాగుతోంది.

బంగ్లాదేశ్ పై 1-0తో నెగ్గిన అఫ్ఘనిస్థాన్ కు..ఒమన్ చేతిలో 0-3, ఖతర్ చేతిలో 0-6 గోల్స్ తో పరాజయాలు పొందిన రికార్డు ఉంది.

అఫ్ఘనిస్థాన్ ప్రత్యర్థిగా భారత్ కు మెరుగైన రికార్డే ఉంది. ఈ రెండుజట్లు ఇప్పటి వరకూ ఎనిమిదిసార్లు తలపడితే భారత్ 6 విజయాలు, ఒక్కో ఓటమి, ఒక్కో డ్రా రికార్డుతో ఉంది.

స్టార్ స్ట్ర్రయికర్ సునీల్ చెత్రీ నాయకత్వంలోని భారతజట్టు ప్రస్తుత ఈ మ్యాచ్ లో నెగ్గాలంటే… ముందుగా తజకిస్తాన్ శీతల వాతావరణం, ఆ తర్వాత అఫ్ఘనిస్థాన్ జట్లను అధిగమించాల్సి ఉంది.

First Published:  13 Nov 2019 8:58 PM
Next Story