క్లైమాక్స్ కోసం తెనాలి చూడాలంట
ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి రాబోతోంది తెనాలి రామకృష్ణ సినిమా. కామెడీ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో క్లయిమాక్స్ హైలైట్ అంటున్నారు. సెన్సార్ పూర్తయిన తర్వాత ఈ టాక్ రావడంతో చాలా మంది నిజం అని నమ్ముతున్నారు. ఇంతకీ క్లయిమాక్స్ ఎలా ఉంటుందంటే.. సినిమాలో కీలకమైన సన్నివేశంలో తెనాలి రామకృష్ణ చాలా తెలివిగా వ్యవహరిస్తాడట. అచ్చం తన గెటప్ లో ఉండే వందలాది మందిని రెడీ చేస్తాడట. అందరికీ ఒకేలాంటి స్కూటర్లు ఇస్తాడట. […]
ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి రాబోతోంది తెనాలి రామకృష్ణ సినిమా. కామెడీ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో క్లయిమాక్స్ హైలైట్ అంటున్నారు. సెన్సార్ పూర్తయిన తర్వాత ఈ టాక్ రావడంతో చాలా మంది నిజం అని నమ్ముతున్నారు. ఇంతకీ క్లయిమాక్స్ ఎలా ఉంటుందంటే.. సినిమాలో కీలకమైన సన్నివేశంలో తెనాలి రామకృష్ణ చాలా తెలివిగా వ్యవహరిస్తాడట. అచ్చం తన గెటప్ లో ఉండే వందలాది మందిని రెడీ చేస్తాడట. అందరికీ ఒకేలాంటి స్కూటర్లు ఇస్తాడట. వీళ్లందరితో కలిసి తీసిన ఆ క్లయిమాక్స్ సన్నివేశం టోటల్ సినిమాకే హైలైట్ అంటున్నారు చాలామంది.
రీసెంట్ గా ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ జరిగింది. కర్నూల్ బ్యాక్ డ్రాప్ లో సినిమా తెరకెక్కింది కాబట్టి, ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను కూడా కర్నూల్ లోనే నిర్వహించారు. ఈ ఫంక్షన్ లో కూడా క్లైమాక్స్ గురించి చాలా గొప్పగా చెప్పారు మేకర్స్. సినిమా అంతా ఒకెత్తయితే, క్లయిమాక్స్ ఒక్కటి మరో ఎత్తు అంటున్నారు. ఆ క్లయిమాక్స్ ను వెండితెరపై చూసి ఆనందించాల్సిందే అంటున్నారు.
పూర్తి కామెడీ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమాలో హన్సిక హీరోయిన్ గా నటించింది. చాన్నాళ్ల తర్వాత హన్సిక నటించిన తెలుగు సినిమా ఇది. ఆమెకిది రీఎంట్రీ అనలేం. ఎందుకంటే ఆమె అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉంది. నటుడు సప్తగిరికి మాత్రం ఇది రీఎంట్రీలాంటిదే. ఎందుకంటే, ఇన్నాళ్లూ హీరో వేషాలు వేసిన ఈ కమెడియన్, కామెడీ పాత్రలకు పూర్తిగా దూరమయ్యాడు. ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ కామెడీ చేశాడు. అటు సంగీత దర్శకుడు సాయికార్తీక్ కు ఇది తన కెరీర్ లో 75వ చిత్రం.