దేవినేని అవినాష్ జంప్? మరికొద్ది గంటల్లో కీలక నిర్ణయం
ఇసుక కొరతపై టీడీపీ అధినేత చంద్రబాబు ఒకరోజు దీక్ష ప్లాన్ చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆయన ప్రణాళిక వేశారు. ప్రతిపక్ష పార్టీలను కలుపుకుని ఇసుక కొరతపై ఉద్యమించాలనేది చంద్రబాబు ఎత్తుగడ. చంద్రబాబు దీక్షకు ముందే ఆయనకు షాక్‌లు ఇవ్వాలని అధికార వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఇసుక కొరత లేకుండా సమీక్షలు నిర్వహించింది. ర్యాంప్‌లో ఇసుకను డంప్ చేస్తోంది. అమరావతి పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఇసుక అందుబాటులో ఉంచే ప్రయత్నం […]
ఇసుక కొరతపై టీడీపీ అధినేత చంద్రబాబు ఒకరోజు దీక్ష ప్లాన్ చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆయన ప్రణాళిక వేశారు. ప్రతిపక్ష పార్టీలను కలుపుకుని ఇసుక కొరతపై ఉద్యమించాలనేది చంద్రబాబు ఎత్తుగడ.
చంద్రబాబు దీక్షకు ముందే ఆయనకు షాక్‌లు ఇవ్వాలని అధికార వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఇసుక కొరత లేకుండా సమీక్షలు నిర్వహించింది. ర్యాంప్‌లో ఇసుకను డంప్ చేస్తోంది. అమరావతి పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఇసుక అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తోంది.
ప్రభుత్వపరంగా ఇది ఒక ఎత్తుగడ అయితే….రాజకీయంగా కూడా టీడీపీకి షాక్‌లు ఇవ్వాలనే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నలుగైదుగురు టీడీపీ నేతలు వైసీపీకి టచ్‌లో ఉన్నారట. వీరిలో కొందరిని చంద్రబాబు దీక్ష రోజే చేర్చుకోవాలనేది వారి ప్లాన్.
దేవినేని నెహ్రు కుమారుడు, గత ఎన్నికల్లో గుడివాడ నుంచి కొడాలి నానిపై పోటీ చేసిన దేవినేని అవినాష్ పార్టీ మారుతారని ప్రచారం జరుగుతోంది. ఆయన వైసీపీలో చేరుతారని బెజవాడలో గుసగుసలు విన్పిస్తున్నాయి. గత రెండు రోజులుగా ఆయన టీడీపీ శ్రేణులకు అందుబాటులో లేరని తెలుస్తోంది. ఇసుక కొరత మీద విజయవాడలో చంద్రబాబు దీక్షకు ఏర్పాట్లలో కూడా అవినాష్ పాల్గొనడం లేదు. దీంతో అవినాష్ పార్టీ మారుతారనే న్యూస్ వైరల్ అవుతోంది.
గత ఎన్నికల్లో గన్నవరం లేదా విజయవాడ తూర్పు సీటును దేవినేని అవినాష్ ఆశించారు. కానీ రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఆయన్ని గుడివాడకు పంపించారు. కొడాలి నానిపై ఆయన ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన పార్టీ మారుతారని అనుచరులు చెబుతున్నారు. విజయవాడ తూర్పులో వైసీపీకి నియోజకవర్గ నేత కావాలి. తూర్పు ఇంచార్జ్ సీటు ఇస్తే అవినాష్ పార్టీ మారుతారని ఆయన అనుచరవర్గం అంటోంది. అయితే అవినాష్ వైసీపీలో చేరుతారా? వల్లభనేని వంశీ వ్యవహారంలా పెండింగ్‌లో పడుతుందా? అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది.