Telugu Global
NEWS

ఏటీపీ టూర్ ఫైనల్స్ లో జోకో గెలుపు, ఫెదరర్ ఓటమి

స్విస్ గ్రేట్ కు ఆస్ట్ర్రియన్ థండర్ షాక్ లండన్ వేదికగా జరుగుతున్న 2019 ఏటీపీ టూర్ ఫైనల్స్ ..గ్రూప్ రౌండ్ రాబిన్ లీగ్ లో మాజీ చాంపియన్లు రోజర్ ఫెదరర్, నొవాక్ జోకోవిచ్ లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ప్రపంచనంబర్ వన్ జోకోవిచ్, డోమనిక్ థీమ్, మాటియో బెర్టినీలతో కూడిన జోర్న్ బోర్గ్ గ్రూప్ ప్రారంభ పోటీలలో జోకోవిచ్ నెగ్గి… ఫెదరర్ ఓటమి పాలయ్యారు. ఆరుసార్లు విజేత ఫెదరర్ ను తొలి పోటీలో డోమనిక్ థైమ్ 7-5, 7-5తో […]

ఏటీపీ టూర్ ఫైనల్స్ లో జోకో గెలుపు, ఫెదరర్ ఓటమి
X
  • స్విస్ గ్రేట్ కు ఆస్ట్ర్రియన్ థండర్ షాక్

లండన్ వేదికగా జరుగుతున్న 2019 ఏటీపీ టూర్ ఫైనల్స్ ..గ్రూప్ రౌండ్ రాబిన్ లీగ్ లో మాజీ చాంపియన్లు రోజర్ ఫెదరర్, నొవాక్ జోకోవిచ్ లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి.

ప్రపంచనంబర్ వన్ జోకోవిచ్, డోమనిక్ థీమ్, మాటియో బెర్టినీలతో కూడిన జోర్న్ బోర్గ్ గ్రూప్ ప్రారంభ పోటీలలో జోకోవిచ్ నెగ్గి… ఫెదరర్ ఓటమి పాలయ్యారు.

ఆరుసార్లు విజేత ఫెదరర్ ను తొలి పోటీలో డోమనిక్ థైమ్ 7-5, 7-5తో అధిగమించాడు. కీలక సమయాలలో పొరపాట్లు చేయడం ద్వారా ఫెదరర్ చేజేతులా ఓటమి కొనితెచ్చుకొన్నాడు.

2008 తర్వాత టూర్ పైనల్స్ టోర్నీ నాకౌట్ రౌండ్ చేరడంలో విఫలమైన ఫెదరర్ కు…డోమనిక్ థీమ్ ప్రత్యర్థిగా 2 విజయాలు, 5పరాజయాల రికార్డు ఉండటం విశేషం.

జోకోవిచ్ అలవోక గెలుపు

గ్రూపు మరో తొలిరౌండ్ పోటీలో రెండోర్యాంకర్ నొవాక్ జోకోవిచ్ 6-2, 6-1 తో ఇటలీ ఆటగాడు మాటియో బెర్టినీని చిత్తు చేశాడు.
గ్రూప్ రెండోరౌండ్ పోటీలో జోకోవిచ్ తో ఫెదరర్ అమీతుమీ తేల్చుకోనున్నాడు.

First Published:  11 Nov 2019 9:00 PM
Next Story