Telugu Global
NEWS

అందుకే కన్నా... అప్పుడప్పుడు ఇంగ్లీష్ పేపర్లు కూడా చదవాలనేది....

బీజేపీ పుట్టినప్పటి నుంచి ఆపార్టీలోనే ఉంటున్న ఏపీ బీజేపీ నేతలంతా కామ్‌గానే ఉంటున్నారు గానీ… కాంగ్రెస్‌లో అనేక పదవులు అనుభవించి… ఒకదశలో పీసీసీ చీఫ్‌ పదవి కోసం కూడా పోటీ పడి… కాంగ్రెస్ ఏపీలో దెబ్బతినిపోగానే బీజేపీలో చేరి… ఆ పార్టీ నుంచి వైసీపీలో చేరేందుకు ప్రయత్నించి… చివరకు ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి ఖాయం అవడంతో ఆఖరి నిమిషంలో అనారోగ్యం అంటూ వైసీపీలో చేరకుండా ఆస్పత్రిలో చేరి… బీజేపీలోనే ఉండిపోయి… ఆ తర్వాత ఏపీ బీజేపీ […]

అందుకే కన్నా... అప్పుడప్పుడు ఇంగ్లీష్ పేపర్లు కూడా చదవాలనేది....
X

బీజేపీ పుట్టినప్పటి నుంచి ఆపార్టీలోనే ఉంటున్న ఏపీ బీజేపీ నేతలంతా కామ్‌గానే ఉంటున్నారు గానీ… కాంగ్రెస్‌లో అనేక పదవులు అనుభవించి… ఒకదశలో పీసీసీ చీఫ్‌ పదవి కోసం కూడా పోటీ పడి… కాంగ్రెస్ ఏపీలో దెబ్బతినిపోగానే బీజేపీలో చేరి… ఆ పార్టీ నుంచి వైసీపీలో చేరేందుకు ప్రయత్నించి… చివరకు ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి ఖాయం అవడంతో ఆఖరి నిమిషంలో అనారోగ్యం అంటూ వైసీపీలో చేరకుండా ఆస్పత్రిలో చేరి… బీజేపీలోనే ఉండిపోయి… ఆ తర్వాత ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పదవి సాధించిన కన్నా లక్ష్మీనారాయణ మాత్రం ప్రతి దానికీ మతం.. మతం అంటూ కేకలేస్తున్నారు.

బీజేపీలో గొప్ప నేతగా పేరు తెచ్చుకోవాలనుకుంటే ప్రతిదానికి మత కోణంలో మాట్లాడటమే మార్గమనుకున్నారో ఏమో గానీ… ఇంగ్లీష్ మీడియం పైనా కన్నా లక్ష్మీనారాయణ మతకోణం ఆవిష్కరించారు. ఇంగ్లీష్‌ మీడియం తీసుకురావడం వెనుక ఒక మతాన్ని రుద్దే ఆలోచన ఉందని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు.

జగన్‌ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం తెస్తుంటే మతం రుద్దే కుట్ర అని వ్యాఖ్యలు చేస్తున్న కన్నా లక్ష్మీనారాయణ… మరి ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్‌ సర్కార్‌ ఏకంగా 7వేల ప్రభుత్వ పాఠశాలలను ఇంగ్లీష్‌ మీడియంలోకి మార్చేసింది కదా అనేదానికి ఏం సమాధానం చెబుతారు.

7వేల స్కూళ్లను ఇంగ్లీష్‌ మీడియంలోకి మార్చేస్తున్నామని 2017లోనే యోగి ఆదిత్యనాథ్‌ సర్కార్ ప్రకటించిన అంశాన్ని ఆధారాలతో సహా సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న నెటిజన్లకు ఏం సమాధానం చెబుతారు?. గత బీజేపీ పాలనలో మహారాష్ట్రలోనూ వేలాది ప్రభుత్వ స్కూళ్లను ఇంగ్లీష్ మీడియంలోకి మార్చింది నిజం కాదా?.

కన్నా లక్ష్మీనారాయణ మేధావితనం ఆధారంగానే ఆలోచిస్తే… యోగి ఆదిత్యనాథ్‌ కూడా యూపీలో 7వేల స్కూళ్లను ఇంగ్లీష్‌మయం చేయడం వెనుక మత కోణం ఉందని భావించాలా?.

యోగి ఆదిత్యనాథ్‌ కంటే కన్నా లక్ష్మీనారాయణ ఏమీ గొప్ప హిందుత్వ అభిమాని కాదు కదా!. ఆదిత్యనాథే ఇంగ్లీష్‌ అవసరాన్ని గుర్తించినప్పుడు కన్నా లక్ష్మీనారాయణకు మాత్రం మత కోణం ఏ కోణంలో నుంచి చూస్తే కనిపించిందో!. ఆర్‌ఎస్‌ఎస్‌ శిశుమందిర్‌ పాఠశాలల్లోనూ ఇంగ్లీష్‌ మీడియంను ప్రవేశపెట్టారు కదా దానికేమంటారు. వెంకయ్యనాయుడికి చెందిన అక్షర స్కూళ్లు పూర్తిగా ఇంగ్లీష్‌మయమే కదా… దానికి ఎవరు సమాధానం చెబుతారు?.

బీజేపీకి చెందిన సోమువీర్రాజులాంటి వారు కూడా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంలో తప్పేంటి అని ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో తెలుగు మీడియంను కొనసాగించాలని కోరుతున్నారు.

అలా అగడడంతో తప్పులేదు గానీ… ఇంగ్లీష్‌ మీడియం తీసుకురావడం వెనుక మత కోణం ఉందంటే సమాజంలో ప్రజల మధ్య పరస్పర అనుమానాలను శాశ్వతం చేసే ఆలోచనగానే చూడాల్సి వస్తుంది.

అసలు ఇంగ్లీష్ నేర్చుకుంటే మత కోణాలు మారిపోతాయి అనుకుంటే కన్నా లక్ష్మీనారాయణ తన పిల్లలను ఏ మీడియంలో చదివిస్తున్నారు?. ఏమాటకామాట చెప్పాలి. గతంలో కన్నా లక్ష్మీనారాయణ హుందాగా రాజకీయాలు చేసేవారన్న పేరుంది. ఆయనను పార్టీలకతీతంగా అభిమానించేవారు. కాకపోతే బీజేపీలో తన పట్టు నిలుపుకోవాలన్న తాపత్రయమో, చంద్రబాబు తాయిలాల మహత్యమో ఏమో గానీ… చివరకు తిరుమల కొండల్లో సీసీ కెమెరాల కోసం ఏర్పాటు చేసిన స్థంభాన్ని కూడా శిలువ అంటూ ఎవరో అనామకులు ప్రచారం చేస్తే… దాన్ని తన సోషల్ మీడియాలో షేర్ చేసుకుని, నిజానిజాలు గుర్తించకుండానే ఆరోపణలు చేసే స్థితికి కన్నా లక్ష్మీనారాయణ లాంటి సీనియర్‌ నాయకులు రావడమే బాధాకరం.

First Published:  12 Nov 2019 6:09 AM GMT
Next Story