ఐదేళ్ల తర్వాత విండీస్ తొలి సిరీస్ విజయం
అఫ్ఘనిస్థాన్ పై 2-0తో విండీస్ గెలుపు ప్రపంచ మాజీ చాంపియన్ వెస్టిండీస్ ఐదేళ్ల తర్వాత వన్డే క్రికెట్లో తొలి సిరీస్ గెలుచుకొంది. అప్ఘనిస్థాన్ తో జరుగుతున్న మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్ లోని మొదటి రెండు వన్డేలు నెగ్గడం ద్వారా 2-0తో సిరీస్ ఖాయం చేసుకొంది. లక్నోలోని ఏక్నా స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ సిరీస్ తొలి వన్డేని అలవోకగా నెగ్గిన విండీస్ జట్టు…రెండో వన్డేలో 47 పరుగుల విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ […]
- అఫ్ఘనిస్థాన్ పై 2-0తో విండీస్ గెలుపు
ప్రపంచ మాజీ చాంపియన్ వెస్టిండీస్ ఐదేళ్ల తర్వాత వన్డే క్రికెట్లో తొలి సిరీస్ గెలుచుకొంది. అప్ఘనిస్థాన్ తో జరుగుతున్న మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్ లోని మొదటి రెండు వన్డేలు నెగ్గడం ద్వారా 2-0తో సిరీస్ ఖాయం చేసుకొంది.
లక్నోలోని ఏక్నా స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ సిరీస్ తొలి వన్డేని అలవోకగా నెగ్గిన విండీస్ జట్టు…రెండో వన్డేలో 47 పరుగుల విజయం సాధించింది.
ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన విండీస్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 242 పరుగుల స్కోరు నమోదు చేసింది. నికోలస్ పూరన్ 50 బాల్స్ లో 67 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.
సమాధానంగా 243 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన అప్ఘన్ జట్టు 46 ఓవర్లలో 200 పరుగుల స్కోరుకే కుప్పకూలింది. ఫ్లడ్ లైట్ ల వెలుగులో నిర్వహించిన ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో వేలాదిగా పురుగులు, మిడతలు దండుగా రావడంతో పలుమార్లు మ్యాచ్ కు అంతరాయం కలిగింది.
2014 తర్వాత తొలి సిరీస్
2014లో చివరిసారిగా బంగ్లాదేశ్ పై వన్డే సిరీస్ నెగ్గిన విండీస్ జట్టు…మరో సిరీస్ కోసం ఐదుసంవత్సరాలపాటు వేచిచూడాల్సి వచ్చింది.
మరోవైపు వన్డే క్రికెట్లో అఫ్ఘనిస్థాన్ కు ఇది వరుసగా 11వ పరాజయం కావడం విశేషం.
లక్నో వేదికగానే అప్ఙన్- విండీస్ జట్లు ..టీ-20, టెస్ట్ సిరీస్ ల్లో సైతం తలపడనున్నాయి.