Telugu Global
CRIME

కాచిగూడలో రెండు రైళ్లు ఢీ..

కాచిగూడ స్టేషన్‌ వద్ద రెండు రైళ్లు ఢీ కొన్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఒకే ట్రాక్‌పై రెండు రెళ్లు ఢీకొట్టాయి. ట్రాక్‌పై ప్యాసింజర్‌ రైలు ఉండగా అదే సమయంలో మరో రైలుకు సిగ్నల్ ఇచ్చారు. దాంతో ఆగి ఉన్న ప్యాసింజర్‌ రైలును… ఎంఎంటీఎస్‌ రైలు వచ్చి బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ఎంఎంటీఎస్ ట్రైన్ లోకో పైలట్‌ క్యాబిన్‌లోనే చిక్కుకుపోయి తీవ్రంగా గాయపడ్డారు. అతడి పరిస్థితి విషమంగా ఉంది. రైళ్లు ఢీకొట్టడంతో పలువురు ప్రయాణికులు ఎగిరి పక్కనే ఉన్న […]

కాచిగూడలో రెండు రైళ్లు ఢీ..
X

కాచిగూడ స్టేషన్‌ వద్ద రెండు రైళ్లు ఢీ కొన్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఒకే ట్రాక్‌పై రెండు రెళ్లు ఢీకొట్టాయి. ట్రాక్‌పై ప్యాసింజర్‌ రైలు ఉండగా అదే సమయంలో మరో రైలుకు సిగ్నల్ ఇచ్చారు. దాంతో ఆగి ఉన్న ప్యాసింజర్‌ రైలును… ఎంఎంటీఎస్‌ రైలు వచ్చి బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ఎంఎంటీఎస్ ట్రైన్ లోకో పైలట్‌ క్యాబిన్‌లోనే చిక్కుకుపోయి తీవ్రంగా గాయపడ్డారు. అతడి పరిస్థితి విషమంగా ఉంది.

రైళ్లు ఢీకొట్టడంతో పలువురు ప్రయాణికులు ఎగిరి పక్కనే ఉన్న పొదల్లోకి పడిపోయారు. దాదాపు 30 మంది గాయపడ్డారు. రైళ్లు ఢీకొన్న సమయంలో భారీ శబ్దం రావడంతో స్టేషన్‌ లో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది అక్కడికి పరుగులు తీశారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ముళ్ల పొదల్లో పడిపోయిన వారిని బయటకు తీశారు.

ప్రమాదంలో మూడు బోగీలు పట్టాలు తప్పాయి. సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. ప్రమాదం వల్ల బోగీలు పట్టాలు తప్పడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

First Published:  11 Nov 2019 8:00 AM IST
Next Story