రెస్పాన్స్ తక్కువ, బిల్డప్ ఎక్కువ
ఈ కాలం యూట్యూబ్ లో నంబర్లు తెచ్చుకోవడం పెద్ద సమస్య కాదు. కాస్త ఖర్చు పెడితే కళ్లుచెదిరే వ్యూస్ రాబట్టుకోవచ్చనేది బహిరంగ రహస్యం. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు ఎంత ఖర్చుపెడితే అన్ని వ్యూస్, లైక్స్ వచ్చేస్తున్న రోజులివి. అంత మాత్రానికి తాము రిలీజ్ చేసిన పాట సూపర్ హిట్ అయిపోయిందని చంకలు గుద్దుకోవడం కరెక్ట్ కాదు. ఈ విషయంలో వెంకీమామ కాస్త అత్యుత్సాహం చూపిస్తున్నాడు. సినిమాకు సంబంధించి రీసెంట్ గా ఓ సాంగ్ రిలీజ్ […]
ఈ కాలం యూట్యూబ్ లో నంబర్లు తెచ్చుకోవడం పెద్ద సమస్య కాదు. కాస్త ఖర్చు పెడితే కళ్లుచెదిరే వ్యూస్ రాబట్టుకోవచ్చనేది బహిరంగ రహస్యం. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు ఎంత ఖర్చుపెడితే అన్ని వ్యూస్, లైక్స్ వచ్చేస్తున్న రోజులివి. అంత మాత్రానికి తాము రిలీజ్ చేసిన పాట సూపర్ హిట్ అయిపోయిందని చంకలు గుద్దుకోవడం కరెక్ట్ కాదు. ఈ విషయంలో వెంకీమామ కాస్త అత్యుత్సాహం చూపిస్తున్నాడు.
సినిమాకు సంబంధించి రీసెంట్ గా ఓ సాంగ్ రిలీజ్ చేశారు. ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఈ పాటకు మిలియన్ వ్యూస్ వచ్చాయి. అంతవరకు నిజమే. కానీ దానికే పాటను ఎపిక్ అంటూ పోల్చడం సరికాదు. మేకర్స్ మాత్రం దీనిపై ఏకంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం విడ్డూరం. నిజానికి ఈ పాట ఏమంత బాగాలేదు. శ్రోతల నుంచి రొటీన్ ట్యూన్ అనే కామెంట్ వినిపించింది. అటు తమన్ కూడా ఈ సాంగ్ విషయంలో సైలెంట్ గానే ఉన్నాడు. కానీ వెంకీ మామ హంగామా మాత్రం అలా లేదు. సామజవరగమన తర్వాత మా పాటే సూపర్ అనే రేంజ్ లో సోషల్ మీడియాలో బిల్డప్ ఇస్తున్నారు.
వెంకీమామకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ టైటిల్ సాంగ్ ను రామజోగయ్యశాస్త్రి రాయగా, శ్రీకృష్ణ ఆలపించాడు. వెంకీ-చైతూ హీరోలుగా నటించిన ఈ సినిమాలో పాయల్, రాశిఖన్నా హీరోయిన్లు. బాబి దర్శకుడు.
Here’s the First Single from #VenkyMamahttps://t.co/CTgi7KyVC5#VenkateshDaggubati @dirbobby @starlingpayal @RaashiKhanna @MusicThaman @ramjowrites @srikrisin @SureshProdns @peoplemediafcy @SBDaggubati @vivekkuchibotla @adityamusic @VenkyMama
— chaitanya akkineni (@chay_akkineni) November 7, 2019