రైతు ఆత్మహత్యలు.... మహారాష్ట్ర ఫస్ట్... టాప్ 10 లో తెలుగు రాష్ట్రాలు
వానొచ్చినా వరదొచ్చినా.. కరువొచ్చిన కటకట వచ్చినా రైతు సాగు చేస్తూనే ఉంటాడు.. ప్రకృతి ఆడిన ఆటలో బలి అవుతూనే ఉంటాడు. పంటొస్తే ఆనందం.. పంట చేయిదాటితే మరణం.. ఇలా రైతు సమిధ అవుతూనే ఉన్నాడు. పంట నష్టాలు, ఏటేటా పెట్టుబడులు పెరగడం, గిట్టుబాటు ధరలు లేకపోవడం.. ఇలా అప్పుల కుప్పై ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతులు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది ఉన్నారు. అన్నదాతల ఆత్మహత్యలు అన్నీ ఇన్నీ కావు.. తాజాగా రైతుల ఆత్మహత్యలపై జాతీయ నేర గణాంక […]
వానొచ్చినా వరదొచ్చినా.. కరువొచ్చిన కటకట వచ్చినా రైతు సాగు చేస్తూనే ఉంటాడు.. ప్రకృతి ఆడిన ఆటలో బలి అవుతూనే ఉంటాడు. పంటొస్తే ఆనందం.. పంట చేయిదాటితే మరణం.. ఇలా రైతు సమిధ అవుతూనే ఉన్నాడు.
పంట నష్టాలు, ఏటేటా పెట్టుబడులు పెరగడం, గిట్టుబాటు ధరలు లేకపోవడం.. ఇలా అప్పుల కుప్పై ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతులు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది ఉన్నారు. అన్నదాతల ఆత్మహత్యలు అన్నీ ఇన్నీ కావు..
తాజాగా రైతుల ఆత్మహత్యలపై జాతీయ నేర గణాంక సంస్థ చేసిన సర్వేలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
2016లో రైతుల ఆత్మహత్యలను ఈ సంస్థ లెక్కగట్టింది. ఇందులో దేశవ్యాప్తంగా రైతులు అత్యధికంగా ఆత్మహత్యలు చేసుకున్న రాష్ట్రంగా బీజేపీ పాలిత ‘మహారాష్ట్ర’ మొదటి స్థానంలో ఉండడం విశేషం.
ఇక వ్యవసాయ రంగంలో తెలుగు రాష్ట్రాలు పెద్దగా పురోగతి సాధించింది ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో ఉండగా తెలంగాణ ఆరోస్థానంలో ఉంది. మహారాష్ట్రలో వ్యవసాయం మీద చాలా మంది ఆధారపడి ఉన్నారు. అక్కడ రైతు ఆందోళనలు కూడా ఎక్కువే. అందుకే ఆత్మహత్యలు కూడా పెరిగిపోయాయని తేలింది.
ఇక దేశవ్యాప్తంగా 2016 సంవత్సరంలో ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతుల సంఖ్య ఏకంగా 11,379 ఉండడం విస్తుగొలుపుతోంది. 2015లో ఈ లెక్క ఏకంగా 12602 ఉండడం విశేషం.