స్కూల్ ప్రవేశ వయసు మూడేళ్లకు తగ్గింపు....
ఇప్పటి వరకు ప్రభుత్వ స్కూళ్లలో పిల్లలను చేర్పించాలంటే ఐదేళ్ల కనీస వయసు ఉండాలి. ఆ నిబంధనలను సడలించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమవుతోంది. బడిలో ప్రవేశానికి ఐదేళ్ల కనీస వయసు నిబంధనను త్వరలోనే తొలగిస్తామని ఆల్ ఇండియా సాంకేతిక విద్యా మండలి చైర్మన్ అనిల్ సహస్రబుద్దే తెలిపారు. మూడేళ్లకే పిల్లలను బడిలో చేర్పించేందుకు త్వరలోనే అనుమతించనున్నట్టు వివరించారు. విజయవాడ వచ్చిన ఆయన… విద్యార్థులకు తరగతి గదిలో బోధన కంటే ఇంటరాక్షన్, పరిసరాల పరిశీలన ద్వారా బోధనకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. […]

ఇప్పటి వరకు ప్రభుత్వ స్కూళ్లలో పిల్లలను చేర్పించాలంటే ఐదేళ్ల కనీస వయసు ఉండాలి. ఆ నిబంధనలను సడలించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమవుతోంది.
బడిలో ప్రవేశానికి ఐదేళ్ల కనీస వయసు నిబంధనను త్వరలోనే తొలగిస్తామని ఆల్ ఇండియా సాంకేతిక విద్యా మండలి చైర్మన్ అనిల్ సహస్రబుద్దే తెలిపారు. మూడేళ్లకే పిల్లలను బడిలో చేర్పించేందుకు త్వరలోనే అనుమతించనున్నట్టు వివరించారు.
విజయవాడ వచ్చిన ఆయన… విద్యార్థులకు తరగతి గదిలో బోధన కంటే ఇంటరాక్షన్, పరిసరాల పరిశీలన ద్వారా బోధనకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. దేశంలో ఇంజనీరింగ్ కాలేజీలు భారీగా మూతపడుతున్న అంశాన్ని ఆయన ప్రస్తావించారు.
గడిచిన పదేళ్లుగా ఏటా 200 ఇంజనీరింగ్ కాలేజీలు దేశంలో మూతపడుతున్నాయని వివరించారు. ఈ నేపథ్యంలో వచ్చే రెండేళ్ల పాటు కొత్తగా ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వబోమని సహస్రబుద్దే వివరించారు.