Telugu Global
NEWS

డే-నైట్ టెస్ట్ గంట మోగించనున్న మమత,హసీనా

కోల్ కతా వేదికగా 22 -26 వరకూ డే-నైట్ టెస్ట్ క్రికెట్ క్రేజీ భారత గడ్డపై జరుగనున్న మొట్టమొదటి డే-నైట్ టెస్ట్ మ్యాచ్ ను..బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కలిసి ప్రారంభించనున్నారు. కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా నవంబర్ 22 నుంచి 26 వరకూ భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే డే-నైట్ టెస్ట్ మ్యాచ్ ను…మమత-హసీనా కలసి.. స్టేడియంలోని గంటను మోగించడం ద్వారా ప్రారంభిస్తారని బెంగాల్ క్రికెట్ సంఘం కార్యదర్శి […]

డే-నైట్ టెస్ట్ గంట మోగించనున్న మమత,హసీనా
X
  • కోల్ కతా వేదికగా 22 -26 వరకూ డే-నైట్ టెస్ట్

క్రికెట్ క్రేజీ భారత గడ్డపై జరుగనున్న మొట్టమొదటి డే-నైట్ టెస్ట్ మ్యాచ్ ను..బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కలిసి ప్రారంభించనున్నారు.

కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా నవంబర్ 22 నుంచి 26 వరకూ భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే డే-నైట్ టెస్ట్ మ్యాచ్ ను…మమత-హసీనా కలసి.. స్టేడియంలోని గంటను మోగించడం ద్వారా ప్రారంభిస్తారని బెంగాల్ క్రికెట్ సంఘం కార్యదర్శి అవిషేక్ దాల్మియా ప్రకటించారు.

ఫ్లడ్ లైట్ల వెలుతురులో…గులాబీ రంగు బంతితో నిర్వహించే ఈ టెస్ట్ ప్రారంభ వేడుకల్లో బెంగాల్ గవర్నర్ జగ్దీప్ దన్కర్ సైతం పాల్గోనున్నారు.

ప్రత్యేక అతిథులుగా…

భారత చెస్ దిగ్గజం, ఆల్ టైమ్ గ్రేట్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్, సచిన్ టెండుల్కర్, సానియా మీర్జా, అభినవ్ భింద్రా, పీవీ సింధు, మేరీ కోమ్ ప్రత్యేక అతిథులుగా హాజరుకానున్నారు.

ఈడెన్ గార్డెన్స్ వేదికగా 2000 సంవత్సరంలో బంగ్లాదేశ్ తన అరంగేట్రం టెస్ట్ మ్యాచ్ ను ఆడింది. ఆ మ్యాచ్ ద్వారానే సౌరవ్ గంగూలీ సైతం టెస్ట్ కెప్టెన్ గా తన తొలిమ్యాచ్ లో పాల్గొన్నాడు.

19 సంవత్సరాల క్రితం జరిగిన ఆ మ్యాచ్ లో పాల్గొన్న రెండుజట్ల సభ్యులను సత్కరించి…ప్రత్యేక జ్ఞాపికలు అందచేయనున్నారు. టెస్ట్ మ్యాచ్ ప్రారంభానికి ముందు అతిథులందరినీ గోల్ఫ్ కార్ట్ లపై స్టేడియంలో తిప్పనున్నారు.

మొత్తం మీద..భారత ఉపఖండ దేశాల క్రికెట్ వేదికల్లో జరుగనున్న మొట్టమొదటి డే-నైట్ టెస్టును చిరస్మరణీయంగా నిర్వహించడానికి.. సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని బెంగాల్ క్రికెట్ సంఘం అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తోంది.

First Published:  10 Nov 2019 3:06 AM IST
Next Story