ఆరు వరకే ఇంగ్లీష్... కొద్ది మేర సవరణ
ఒకటి నుంచి 8 వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంను తప్పనిసరి చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం కొద్ది మేర మార్చింది. ఒకటి నుంచి ఆరు వరకు ప్రస్తుతానికి ఇంగ్లీష్‌ను బోధించాలని ఉన్నతాధికారుల సమావేశంలో సీఎం ఆదేశించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి వరకు విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో బోధనను తప్పనిసరి చేస్తూ ఈ నెల 5న ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పుడు ఆ ఉత్తర్వులకు కొద్ది మేర మార్పులు చేశారు. […]
ఒకటి నుంచి 8 వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంను తప్పనిసరి చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం కొద్ది మేర మార్చింది. ఒకటి నుంచి ఆరు వరకు ప్రస్తుతానికి ఇంగ్లీష్‌ను బోధించాలని ఉన్నతాధికారుల సమావేశంలో సీఎం ఆదేశించారు.
వచ్చే విద్యాసంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి వరకు విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో బోధనను తప్పనిసరి చేస్తూ ఈ నెల 5న ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పుడు ఆ ఉత్తర్వులకు కొద్ది మేర మార్పులు చేశారు.
జగన్‌మోహన్ రెడ్డి తాజా నిర్ణయంపై తెలుగు బోధనకే పట్టుబడుతున్న వారు సంతృప్తి వ్యక్తం చేయడం లేదు. ప్రభుత్వ స్కూళ్లలో ప్రాథమిక దశలో ఇంగ్లీష్ తప్పనిసరిని వ్యతిరేకిస్తున్న వారు… ఒకటి నుంచి 6 వరకు ఇంగ్లీష్‌ను పరిమితం చేసినా తెలుగు భాషకు ఇబ్బందే అని అభిప్రాయపడుతున్నారు.
ప్రాథమిక విద్య మాతృభాషలో సాగాలన్నది తమ ఉద్దేశమని… కానీ తమ డిమాండ్‌ను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పీడీఎఫ్ ఎమ్మెల్సీలు అభిప్రాయపడ్డారు. కేవలం ఆంగ్లంలో బోధనకు టీచర్ల కొరత కారణంగానే 8వ తరగతి వరకు ఇంగ్లీష్ బోధనను ప్రస్తుతానికి 6వ తరగతి వరకు పరిమితం చేసినట్టు ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.
ఒకటి నుంచి 5 వరకు మాతృభాషలో బోధన చేయాలని తాము డిమాండ్ చేస్తుంటే… ఆ దిశగా ప్రయత్నాలు చేయకుండా… 1 నుంచి 6వరకు ఇంగ్లీష్‌ను తప్పనిసరి చేయడం ఏమిటని పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు.