Telugu Global
NEWS

నాగపూర్ లో నేడే ఆఖరి టీ-20

సిరీస్ కు గురిపెట్టిన భారత్, బంగ్లాదేశ్ భారత్- బంగ్లాదేశ్ జట్ల తీన్మార్ టీ-20 సిరీస్ క్లయ్ మాక్స్ దశకు చేరింది. నాగపూర్ విదర్భ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ రోజు జరిగే ఆఖరాట రెండుజట్లకూ డూ ఆర్ డైగా మారింది. నెగ్గిన జట్టే సిరీస్ సొంతం చేసుకోగలుగుతుంది. ఆతిథ్య భారతజట్టే మరోసారి హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. ఊరిస్తున్న సిరీస్… భారత్, బంగ్లాజట్ల టీ-20 సిరీస్ ముగింపు దశకు చేరింది. న్యూఢిల్లీలో ముగిసిన తొలిమ్యాచ్ లో […]

నాగపూర్ లో నేడే ఆఖరి టీ-20
X
  • సిరీస్ కు గురిపెట్టిన భారత్, బంగ్లాదేశ్

భారత్- బంగ్లాదేశ్ జట్ల తీన్మార్ టీ-20 సిరీస్ క్లయ్ మాక్స్ దశకు చేరింది. నాగపూర్ విదర్భ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ రోజు జరిగే ఆఖరాట రెండుజట్లకూ డూ ఆర్ డైగా మారింది. నెగ్గిన జట్టే సిరీస్ సొంతం చేసుకోగలుగుతుంది. ఆతిథ్య భారతజట్టే మరోసారి హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది.

ఊరిస్తున్న సిరీస్…

భారత్, బంగ్లాజట్ల టీ-20 సిరీస్ ముగింపు దశకు చేరింది. న్యూఢిల్లీలో ముగిసిన తొలిమ్యాచ్ లో బంగ్లాజట్టు 7 వికెట్లతో నెగ్గి 1-0 ఆధిక్యం సాధిస్తే… రాజ్ కోట వేదికగా జరిగిన రెండోమ్యాచ్ లో భారత్ 8 వికెట్ల విజయంతో సిరీస్ ను 1-1తో సమం చేయగలిగింది.

రెండుజట్లు సమఉజ్జీలుగా నిలవడంతో..నాగపూర్ వేదికగా మరికొద్ది గంటల్లో ప్రారంభమయ్యే ఆఖరిమ్యాచ్ రెండుజట్లకూ కీలకంగా మారింది.

ఆతిథ్య భారత్ 2019 సిరీస్ లో తొలి టీ-20 సిరీస్ విజయానికి గురిపెట్టింది. రాజ్ కోట మ్యాచ్ జోరునే ఆఖరి మ్యాచ్ లో సైతం కొనసాగించాలన్న పట్టుదలతో ఉంది.

టాసే కీలకం…

దేశంలోని అతిపెద్ద అవుట్ ఫీల్డ్ కలిగిన స్టేడియాలలో ఒకటిగా పేరుపొందిన నాగపూర్ స్టేడియంలో…స్పిన్ బౌలర్లు మ్యాచ్ విన్నర్లుగా నిలిచే అవకాశం ఉంది.

మొదటి రెండుమ్యాచ్ ల్లో…మొత్తం 8 ఓవర్లలో 80కి పైగా పరుగులిచ్చిన ఖలీల్ అహ్మద్ స్థానంలో మరో ఫాస్ట్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ ను తుదిజట్టులోకి.. భారత్ తీసుకోడం ఖాయంగా కనిపిస్తోంది.

బ్యాటింగ్ లో రోహిత్ శర్మ- శిఖర్ ధావన్ ఇచ్చే ఆరంభంతో పాటు…మిడిల్ ఓవర్లలో యజువేంద్ర చాహల్ స్పిన్ మ్యాజిక్ సైతం కీలకం కానుంది.

బంగ్లాదేశ్ కు చావోరేవో…

భారత్ ప్రత్యర్థిగా గత తొమ్మిది టీ-20 మ్యాచ్ ల్లో తొలివిజయం సాధించిన బంగ్లాదేశ్…తొలి సిరీస్ విజయానికి తహతహలాడుతోంది. సర్వశక్తులూ కూడదీసుకొని పవర్ పుల్ భారత్ ను కంగుతినిపించాలన్న కసితో బంగ్లాదేశ్ బరిలోకి దిగుతోంది. అంతగా అనుభవం లేని భారత బౌలింగ్ ఎటాక్ ను ఆత్మరక్షణలోకి నెట్టడం ద్వారా విజయం సాధించగలమని బంగ్లా కోచ్ ధీమాగా చెబుతున్నాడు.

ముందుగా బ్యాటింగ్ చేస్తేనే…

ప్రస్తుత సిరీస్ లోని మొదటి రెండు మ్యాచ్ ల్లో చేజింగ్ కు దిగిన జట్లు మాత్రమే విజేతలుగా నిలిస్తే…నాగపూర్ మ్యాచ్ లో మాత్రం ముందుగా బ్యాటింగ్ కు దిగిన జట్లకు మాత్రమే విజయావకాశం ఉంటుందని…గత రికార్డులు చెబుతున్నాయి.

విదర్భ క్రికెట్ స్టేడియం వేదికగా ముగిసిన గత 11 మ్యాచ్ ల్లో…ముందుగా బ్యాటింగ్ కు దిగిన జట్లే ఎనిమిది విజయాలు నమోదు చేయడం చూస్తే… టాస్ నెగ్గిన జట్టు మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకోడం ఖాయమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

సూపర్ సండే ఫైట్ గా జరిగే ఈ ఆఖరాట రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది.

First Published:  10 Nov 2019 1:31 AM IST
Next Story