పాకిస్తాన్ ప్రధానికి థ్యాంక్స్ చెప్పిన మోడీ
ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శనివారం మోడీ పంజాబ్ లో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ సిక్కుల పవిత్ర గురుద్వారాలో పూజలు చేశారు. సిక్కు మత వ్యవస్థాపకుడు అయిన గురునానక్ దేవ్ 550 జయంతి సందర్భంగా ప్రసిద్ధ కర్తార్ పూర్ కారిడార్ ను ప్రారంభించినందుకు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు మోడీ థ్యాంక్స్ చెప్పాడు. దేశ విభజనకు ముందు కర్తార్ పూర్ లో సిక్కుల పవిత్ర […]
ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శనివారం మోడీ పంజాబ్ లో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ సిక్కుల పవిత్ర గురుద్వారాలో పూజలు చేశారు. సిక్కు మత వ్యవస్థాపకుడు అయిన గురునానక్ దేవ్ 550 జయంతి సందర్భంగా ప్రసిద్ధ కర్తార్ పూర్ కారిడార్ ను ప్రారంభించినందుకు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు మోడీ థ్యాంక్స్ చెప్పాడు.
దేశ విభజనకు ముందు కర్తార్ పూర్ లో సిక్కుల పవిత్ర గురుద్వారా ఉంది. అది ఇప్పుడు పాకిస్తాన్ లో ఉంది. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఈ కారిడార్ ను తెరవడంతో సిక్కులకు దర్శించుకునే భాగ్యం కలిగింది.
ఇమ్రాన్ తో పాటు పంజాబ్ ప్రభుత్వం, ఎన్జీపీతోపాటు కర్తార్ పూర్ కారిడార్ నిర్మాణంలో కృషి చేసిన ప్రతీ ఒక్కరికి భారత ప్రధాని నరేంద్రమోడీ ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా మోడీ సిక్కుల మత వ్యవస్థాపకుడు అయిన గురునానక్ దేవ్ పై పరిశోధనలకు బ్రిటన్, కెనడాలోని యూనివర్సిటీలకు అవకాశం కల్పిస్తున్నట్టు వివరించారు. అంతేకాదు.. దేశంలోని సిక్కు ప్రసిద్ధ క్షేత్రాలను కలుపుతూ రైల్వే శాఖ కొత్త రైళ్లను వేయాలని ఆదేశించారు.
ఇక జమ్మూకాశ్మీర్ విభజనతో అక్కడ ఉన్న సిక్కులకు కూడా విశేష అధికారాలు లభించాయని మోడీ చెప్పుకొచ్చాడు. గురునానక్ జయంతి సందర్భంగా ఈ సమాన హక్కులను వినియోగించుకోవాలని సిక్కులకు మోడీ పిలుపునిచ్చాడు.