ఏపీ ప్రభుత్వ తీరు పారదర్శకంగా ఉంది.... 2లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి " కేంద్ర మంత్రి
ఆంధ్రప్రదేశ్‌కు అన్ని విధాలుగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ సచివాలంలో థర్మేంద్ర ప్రధాన్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. కడప జిల్లాలో వచ్చే నెలలో శంకుస్థాపన చేయనున్న కడప స్టీల్ ఫ్యాక్టరీకి జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ – ఎన్‌ఎండీసీ నుంచి ఇనుప ఖనిజాన్ని సరఫరా చేసేందుకు కేంద్రమంత్రి అంగీకరించారు. ఖనిజం సరఫరాపై త్వరలోనే ఏపీ […]
ఆంధ్రప్రదేశ్‌కు అన్ని విధాలుగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ సచివాలంలో థర్మేంద్ర ప్రధాన్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించారు.
కడప జిల్లాలో వచ్చే నెలలో శంకుస్థాపన చేయనున్న కడప స్టీల్ ఫ్యాక్టరీకి జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ – ఎన్‌ఎండీసీ నుంచి ఇనుప ఖనిజాన్ని సరఫరా చేసేందుకు కేంద్రమంత్రి అంగీకరించారు. ఖనిజం సరఫరాపై త్వరలోనే ఏపీ ప్రభుత్వానికి, ఎన్‌ఎండీసీకి మధ్య ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించారు.
వచ్చే ఐదేళ్లలో పెట్రోలియం, సహజవాయువులు, ఉక్కు రంగాల్లో ఏపీ వేదికగా రెండు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని ధర్మేంద్ర ప్రధాన్ వివరించారు. దీని వల్ల రాష్ట్రానికి భారీగా ఆదాయం పెరగడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కూడా లభిస్తామని చెప్పారు.
దేశానికి తూర్పు తీరంలో ఉన్న ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయని కేంద్రమంత్రి వివరించారు. పరిశ్రమల ఏర్పాటు విషయంలో ఏపీ ప్రభుత్వ తీరు పాదర్శకంగా ఉందని ప్రశంసించారు.
చమురు, గ్యాస్ కంపెనీలు ఏపీలో తమ టర్నోవర్‌కు తగ్గట్టుగా కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద నిధులు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. చమురు, గ్యాస్ వెలికితీత కంపెనీలు చెల్లిస్తున్న రాయల్టీలో ఏపీకి వాటా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఇందుకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు.
పునర్విభజన చట్టం ప్రకారం క్రూడాయిల్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, కాకినాడలో దీన్ని నెలకొల్పేందుకు సత్వరమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. దీనిపై పెట్రోలియం శాఖ, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో అత్యున్నతస్థాయి సంయుక్త కమిటీని ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి ప్రదాన్ తెలిపారు.