31వేల టన్నుల నుంచి 96వేల టన్నులకు పెరిగిన ఇసుక సరఫరా
ఆంధ్రప్రదేశ్ ఇసుక కొరత నుంచి త్వరలోనే గట్టెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది భారీ వర్షాలు రావడంతో నదులన్నీ వరదమయం అయ్యాయి. దాంతో ఇసుక వెలికితీయడం సాధ్యం కాక లోటు ఏర్పడింది. రోజుకు 85వేల టన్నుల ఇసుక అవసరం ఉండగా… ఒక దశలో 30వేల టన్నులు మాత్రమే సరఫరా అయింది. వరద తగ్గిపోవడంతో ఇప్పుడు పరిస్థితి మెల్లగా మెరుగుపడుతోంది. ఈనెల 1న కేవలం 31వేల 576 టన్నుల ఇసుకను మాత్రమే […]
ఆంధ్రప్రదేశ్ ఇసుక కొరత నుంచి త్వరలోనే గట్టెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది భారీ వర్షాలు రావడంతో నదులన్నీ వరదమయం అయ్యాయి. దాంతో ఇసుక వెలికితీయడం సాధ్యం కాక లోటు ఏర్పడింది. రోజుకు 85వేల టన్నుల ఇసుక అవసరం ఉండగా… ఒక దశలో 30వేల టన్నులు మాత్రమే సరఫరా అయింది.
వరద తగ్గిపోవడంతో ఇప్పుడు పరిస్థితి మెల్లగా మెరుగుపడుతోంది. ఈనెల 1న కేవలం 31వేల 576 టన్నుల ఇసుకను మాత్రమే సరఫరా చేయగలిగారు. ఇప్పుడది 96వేల టన్నులకు చేరింది. గడిచిన ఐదు రోజుల్లో 4లక్షల టన్నుల ఇసుకను స్టాక్ యార్డులకు తరలించారు.
ఇప్పుడిప్పుడే పలు రీచ్‌లు నీటి ముంపు నుంచి బయటపడుతున్నాయని… ఏపీఎండీసీ ఎండీ మధుసూదనరెడ్డి వివరించారు. రీచ్‌ల వద్ద నీరు మరింతగా ఇంకిపోతే రోజుకు 2లక్షల టన్నుల ఇసుకను స్టాక్ పాయింట్లకు చేర్చేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు.
కొన్ని నెలలుగా ఇసుక కొరత ఉన్నందున…. కొద్దిరోజుల పాటు భారీగా ఇసుకను సరఫరా చేస్తే పరిస్థితి సాధారణ స్థాయికి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఐదు రోజుల్లోనే సరఫరా మూడు రెట్లు పెంచామని వివరించారు. మరో పది రోజుల్లో రోజుకు దాదాపు రెండు లక్షల టన్నుల ఇసుకను వెలికితీసేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు.