విద్యుత్ సంస్థల్లో భారీ ప్రక్షాళన
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థల్లో భారీ ప్రక్షాళనకు రంగం సిద్దమైంది. ట్రాన్స్‌కో, జెన్‌కోతో పాటు డిస్కమ్ లో కీలక స్థానాల్లో పాతుకుపోయిన వారిని కదిలించబోతున్నారు. 50వేలకు పైగా జీతం అందుకుంటున్న వారికి స్థానచలనం ఖాయమైంది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్ సంస్థల్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొందరు ఉద్యోగులు కావాలనే ప్రభుత్వానికి సహకరించడం లేదన్న ఆరోపణ ఉంది. ప్రభుత్వానికి సహకరించని వారంతా చంద్రబాబు హయాంలో కీలక స్థానాలను దక్కించుకున్న వారే. టీడీపీ పెద్దలకు అభిమానులుగా ఉన్న కొందరు […]
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థల్లో భారీ ప్రక్షాళనకు రంగం సిద్దమైంది. ట్రాన్స్‌కో, జెన్‌కోతో పాటు డిస్కమ్ లో కీలక స్థానాల్లో పాతుకుపోయిన వారిని కదిలించబోతున్నారు. 50వేలకు పైగా జీతం అందుకుంటున్న వారికి స్థానచలనం ఖాయమైంది.
కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్ సంస్థల్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొందరు ఉద్యోగులు కావాలనే ప్రభుత్వానికి సహకరించడం లేదన్న ఆరోపణ ఉంది.
ప్రభుత్వానికి సహకరించని వారంతా చంద్రబాబు హయాంలో కీలక స్థానాలను దక్కించుకున్న వారే. టీడీపీ పెద్దలకు అభిమానులుగా ఉన్న కొందరు ఉద్యోగులకు టీడీపీ హయాంలో కీలక స్థానాలు దక్కాయి. అర్హత ఉన్నా సరే ఇతరులకు ప్రాధాన్యత లేని పోస్టులే అప్పగించారు.
విద్యుత్ కొనుగోళ్లు, థర్మల్ ప్లాంట్లలో కీలకమైన బొగ్గు రవాణా, ఉత్పత్తి రంగంలోని ముఖ్యమైన పోస్టుల్లో కొంతమంది ఉద్యోగులు సుధీర్ఘ కాలం తిష్టవేశారు.
టీడీపీ హయాంలో వీరిపై పెద్దెత్తున అవినీతి ఆరోపణలు వచ్చినా చర్యలు తీసుకోలేదు. ఈ స్థానాల్లో పాతుకుపోయిన వీరు ఏకంగా కొత్త ప్రభుత్వానికి సహకరించకుండా, విద్యుత్ విషయంలో ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈనేపథ్యంలో ఉన్నతాధికారులు వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నారు. దాదాపు 8వేల మందిని బదిలీ చేయబోతున్నారు.
ప్రధాన కార్యాలయాల నుంచి బయటకు పంపకుండానే… సెక్షన్లను మారుస్తున్నారు. విభాగాల మార్పువల్ల ఉద్యోగుల్లో నూతనోత్సాహం వస్తుందని, కొత్త ఆలోచనలతో పనిచేస్తారని కార్యదర్శి శ్రీకాంత్ ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా బదిలీల కారణంగా అర్హతలు ఉండికూడా ఏళ్ల తరబడి అప్రాధాన్యత పోస్టులతో సరిపెట్టుకున్న తమకు మంచి అవకాశాలు దక్కుతాయని ఇంతకాలం నిర్లక్ష్యానికి గురైన ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.