Telugu Global
NEWS

పోలవరం నిధుల విడుదలకు కేంద్రం అంగీకారం

ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఖర్చు చేసిన రూ. 5,600 కోట్లలో 1,850 కోట్లను విడుదల చేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. త్వరలోనే నాబార్డు నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు విడుదల కానున్నాయి. మిగిలిన సొమ్మును కూడా త్వరలోనే రీయింబర్స్‌మెంట్‌ చేస్తామని కేంద్రం చెప్పింది. ఇప్పటికే రివర్స్ టెండరింగ్ నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం…782 కోట్ల రూపాయలను ఆదా చేసింది. పనులను రివర్స్ […]

పోలవరం నిధుల విడుదలకు కేంద్రం అంగీకారం
X

ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఖర్చు చేసిన రూ. 5,600 కోట్లలో 1,850 కోట్లను విడుదల చేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. త్వరలోనే నాబార్డు నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు విడుదల కానున్నాయి. మిగిలిన సొమ్మును కూడా త్వరలోనే రీయింబర్స్‌మెంట్‌ చేస్తామని కేంద్రం చెప్పింది.

ఇప్పటికే రివర్స్ టెండరింగ్ నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం…782 కోట్ల రూపాయలను ఆదా చేసింది. పనులను రివర్స్ టెండరింగ్‌లో దక్కించుకున్న మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ పోలవరం నిర్మాణ పనులను కూడా ప్రారంభించింది. 2021 నాటికి ప్రాజెక్టును పూర్తి చేసే విధంగా కాంట్రక్టు సంస్థ, ప్రభుత్వం ముందుకెళ్తున్నాయి.

First Published:  8 Nov 2019 12:03 PM IST
Next Story