ఈ బాబు కనిపించడం లేదట... ఈయన కూడా జంపేనా ?
ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు కనిపించడం లేదు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు. వ్యక్తిగత పర్యటనలు లేవు. సమావేశాలకు రావడం లేదు. అసలు రాజకీయంగా యాక్టివ్‌గా లేరు. మాగంటి బాబుకు ఏమైంది? ఇది పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ నేతల ప్రశ్న. 2019 ఎన్నికల్లో మాగంటి గెలుస్తారని అందరూ అనుకున్నారు, ఆయన కూడా ఏలూరు సెగ్మెంట్‌లో విస్తృత ప్రచారం చేశారు. కానీ ఓడిపోయారు. ఎన్నికల్లో పార్టీ అన్ని రకాలుగా తనకు సాయం చేయలేదని అనుచరుల దగ్గర […]
ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు కనిపించడం లేదు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు. వ్యక్తిగత పర్యటనలు లేవు. సమావేశాలకు రావడం లేదు. అసలు రాజకీయంగా యాక్టివ్‌గా లేరు. మాగంటి బాబుకు ఏమైంది? ఇది పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ నేతల ప్రశ్న.
2019 ఎన్నికల్లో మాగంటి గెలుస్తారని అందరూ అనుకున్నారు, ఆయన కూడా ఏలూరు సెగ్మెంట్‌లో విస్తృత ప్రచారం చేశారు. కానీ ఓడిపోయారు. ఎన్నికల్లో పార్టీ అన్ని రకాలుగా తనకు సాయం చేయలేదని అనుచరుల దగ్గర మాగంటి వాపోయారట. ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు తనకు విలువ ఇవ్వలేదని అన్నారట. చింతలపూడి మార్కెట్ యార్డ్ ఛైర్మన్ పదవి తన అనుచరుడికి ఇవ్వకపోవడం తనకు తీవ్రంగా కలిచివేసిందని అప్పట్లో అనేవారట.
అయితే ఎన్నికలు రావడంతో మరోసారి మాగంటి బాబు ఎంపీగా పోటీ చేశారు. అయితే ప్రస్తుతం మాగంటి బాబు ఆరోగ్యం కూడా సహకరించడం లేదు. దీంతో ఆయన యాక్టివ్‌గా ఉండడం లేదు. రాజకీయ వారసుడిగా జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు మాగంటి రామ్ జీ తెరపైకి వచ్చారు. ఈయనపై మాగంటి ఫ్యామిలీ ఆశలు పెట్టుకుంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హడావుడి చేసిన ఈయన కూడా సైలెంట్ అయ్యారు. దీంతో మాగంటి ఫ్యామిలీ అడుగులు ఎటువైపు అనే చర్చ మొదలైంది.
దెందలూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జైలు జీవితం గడుపుతున్నాడు. తన సామాజికవర్గానికి చెందిన ఆయన్ని కూడా పరామర్శించేందుకు మాగంటి రాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
పశ్చిమగోదావరి జిల్లా పర్యటనకు ఈ మధ్య లోకేష్ వచ్చాడు. పార్టీ విస్తృత సమావేశాలు జరిగాయి. కానీ వ్యక్తిగత కారణాల వల్ల రాలేకపోతున్నానని మాగంటి మేసేజ్ పంపారట. ఎన్నికల తర్వాత ఆయన పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నాడు. ఢిల్లీలో ఆయనకు ఉన్న పరిచయాల నేపథ్యంలో మాగంటి పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని ఆయన అనుచరవర్గం చెబుతోంది. బీజేపీలో ఆయన చేరవచ్చని ఒకరిద్దరు అంటున్నారు. మరి ఏలూరు రాజకీయాల్లో ఏం జరుగుతుందో చూడాలి.