వంశీని జగన్ దూరం పెడుతోంది అందుకేనా?
టీడీపీకి గుడ్ బై చెప్పిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ భవిష్యత్ ఇప్పుడు జగన్ చేతిలో ఉన్నట్టు సమాచారం. ముఖ్యమంత్రి జగన్ అనుమతిస్తే పార్టీలో చేరేందుకు వంశీ ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం వంశీ నవంబర్ 4 లేదా 5వ తేదీల్లో ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరాల్సి ఉంది. కానీ జగన్ బిజీ షెడ్యూల్ కారణంగా ఈ చేరిక ఆగిపోయింది. అయితే వంశీ చేరికకు ఆయన కోరికలు కూడా అడ్డుగా మారాయని వైసీపీలో […]
టీడీపీకి గుడ్ బై చెప్పిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ భవిష్యత్ ఇప్పుడు జగన్ చేతిలో ఉన్నట్టు సమాచారం. ముఖ్యమంత్రి జగన్ అనుమతిస్తే పార్టీలో చేరేందుకు వంశీ ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం వంశీ నవంబర్ 4 లేదా 5వ తేదీల్లో ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరాల్సి ఉంది. కానీ జగన్ బిజీ షెడ్యూల్ కారణంగా ఈ చేరిక ఆగిపోయింది.
అయితే వంశీ చేరికకు ఆయన కోరికలు కూడా అడ్డుగా మారాయని వైసీపీలో చర్చ జరుగుతోంది. వంశీ తన రాజకీయ భవిష్యత్తు కోసం వైసీపీ అధినేత జగన్ వద్ద పలు ప్రతిపాదనలు పెట్టినట్టు తెలిసింది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాక.. ఏదైనా ఎమ్మెల్సీ లేదా నామినేటెడ్ పదవి ఇస్తేనే చేరుతానని వంశీ జగన్ ను కోరినట్టు తెలిసింది. అయితే దీనిపై జగన్ ఎలాంటి హామీ ఇవ్వలేదని సమచారం.
ఇక వంశీ కోరిన మరో కోరిక కూడా జగన్ తీర్చలేనిదిగానే ఉందట.. హైదరాబాద్ లో వివాదంలో ఉన్న తన ఆస్తుల రక్షణ బాధ్యత కూడా జగన్ తీసుకోవాలని వంశీ కోరినట్లు తెలిసింది. దీనిపై కూడా జగన్ అయిష్టంగా ఉన్నట్టు వైసీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
హైదరాబాద్ లో వంశీకి చాలా ఇళ్ళ స్థలాలున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఉన్నాడు. ఈ సమస్యలపై ఇప్పటికే వంశీ మంత్రి కేటీఆర్ ను కోరినా పరిష్కరించలేదట.. జగన్ తో చెప్పించాలని వంశీ ఆలోచిస్తున్నా… ఈ విషయంలో వైసీపీ అధినేత జోక్యం చేసుకునేందుకు ఇష్టపడడంలేదట.
హైదరాబాద్ లో ఏపీకి చెందిన డజన్ల మంది ఎమ్మెల్యేల ఆస్తులు హైదరాబాద్ లో వివాదంలో ఉన్నాయి. ఆ వ్యవహారాల్లో తలదూర్చడం జగన్ కు ఇష్టం లేదట. అందుకే వంశీ కోరిక తీర్చలేక జగన్ ఆయన్ను దూరంగా పెడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.