జగన్ పాలన ధర్మబద్దంగా ఉంది కాబట్టే పుష్కలంగా వర్షాలు " రమణ దీక్షితులు
కనీస ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్చకులకు చంద్రబాబు ప్రభుత్వం పదవి విరమణ ప్రకటించిందని, హఠాత్తుగా తొలగించిందని టీటీడీ ఆగమ సలహాదారుడిగా నియమితులైన రమణదీక్షితులు ఆవేదన చెందారు. ఆగమ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన… తాము అధికారంలోకి వస్తే అర్చకులకు వంశపారంపర్య అవకాశం కల్పిస్తామని జగన్ మోహన్ రెడ్డి చెప్పారన్నారు. చెప్పినట్టుగానే దేవుడి ఆశీస్సులతో కొత్త ప్రభుత్వం వంశపారంపర్య అర్చకత్వానికి పదవీ విరమణ లేకుండా చేసిందన్నారు. అదే రీతిలో […]
కనీస ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్చకులకు చంద్రబాబు ప్రభుత్వం పదవి విరమణ ప్రకటించిందని, హఠాత్తుగా తొలగించిందని టీటీడీ ఆగమ సలహాదారుడిగా నియమితులైన రమణదీక్షితులు ఆవేదన చెందారు.
ఆగమ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన… తాము అధికారంలోకి వస్తే అర్చకులకు వంశపారంపర్య అవకాశం కల్పిస్తామని జగన్ మోహన్ రెడ్డి చెప్పారన్నారు. చెప్పినట్టుగానే దేవుడి ఆశీస్సులతో కొత్త ప్రభుత్వం వంశపారంపర్య అర్చకత్వానికి పదవీ విరమణ లేకుండా చేసిందన్నారు. అదే రీతిలో టీటీడీలో కూడా వంశపారంపర్య అర్చకత్వానికి పదవీ విరమణ తీసివేస్తామని ఇటీవల టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారని… ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఉత్తర్వులను కూడా ఇచ్చారన్నారు.
తనను ఆగమ సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారని… మరో వారంలో అర్చకత్వ బాధ్యతలు కూడా అప్పగించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. వంశపారంపర్య అర్చకత్వానికి అవకాశం కల్పించడంతోపాటు.. ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు జీతాలు పెంచారని అందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ధర్మబద్ధంగా పాలన చేస్తుండడం వల్లే ఈఏడాది దేవుడు కూడా ఆశీర్వదించారని, అందుకే రాష్ట్ర వ్యాప్తంగా పుష్కలంగా వర్షాలు కురుస్తున్నాయన్నారు.
బ్రాహ్మణులకు అండగా ఉంటున్న జగన్ మోహన్ రెడ్డి మరో 30 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలని… ఆయన కుటుంబం బాగుండాలని తాను కోరుకుంటున్నట్టు రమణ దీక్షితులు చెప్పారు. ఒక మంచి రోజు ముఖ్యమంత్రి క్షేమాన్ని, రాష్ట్ర క్షేమాన్ని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించాలని అర్చక సమాజం నిర్ణయం తీసుకుందన్నారు. తనకు తిరిగి శ్రీవారి సేవ చేసుకునే అవకాశం కల్పిస్తున్న ముఖ్యమంత్రి, టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి, టీటీడీ ఈవో తదితర అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.