Telugu Global
NEWS

విద్వేషమే నీ సంస్కారమా?- పవన్ పై భగ్గుమంటున్న సీమ యువత

తనకు అందరూ సమానమే అని …. ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంతో తనకు విపరీతమైన అనుబంధం ఉందని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ చెబుతుంటారు. కానీ ఆయన తన ప్రసంగాల్లో చేసే ప్రాంతీయ విద్వేషపూరిత వ్యాఖ్యలు మాత్రం పదేపదే దుమారం రేపుతూనే ఉన్నాయి. ఎన్నికల ప్రచారంలో రాయలసీమ రౌడీలు, సీమ ఫ్యాక్షనిస్టులు, కడప రౌడీలు అంటూ పదేపదే పవన్ కల్యాణ్ రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు. ఆ తరహా వ్యాఖ్యల ప్రభావమో ఏమో గానీ పవన్ కల్యాణ్‌ను […]

విద్వేషమే నీ సంస్కారమా?- పవన్ పై భగ్గుమంటున్న సీమ యువత
X

తనకు అందరూ సమానమే అని …. ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంతో తనకు విపరీతమైన అనుబంధం ఉందని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ చెబుతుంటారు. కానీ ఆయన తన ప్రసంగాల్లో చేసే ప్రాంతీయ విద్వేషపూరిత వ్యాఖ్యలు మాత్రం పదేపదే దుమారం రేపుతూనే ఉన్నాయి.

ఎన్నికల ప్రచారంలో రాయలసీమ రౌడీలు, సీమ ఫ్యాక్షనిస్టులు, కడప రౌడీలు అంటూ పదేపదే పవన్ కల్యాణ్ రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు. ఆ తరహా వ్యాఖ్యల ప్రభావమో ఏమో గానీ పవన్ కల్యాణ్‌ను సొంత జిల్లా ప్రజలు కూడా తిరస్కరించారు. అయితే ఎన్నికల తర్వాత కూడా పవన్ కల్యాణ్ వైఖరిలో మార్పు రావడం లేదు. తాజాగా మరోసారి రాయలసీమ ప్రాంతాన్ని తక్కువ చేసేలా వ్యాఖ్యలు చేశారు.

జగన్‌ మోహన్‌ రెడ్డిని విమర్శించే క్రమంలో పవన్ కల్యాణ్ రాయలసీమపై వ్యాఖ్యలు చేశారు. కర్నూలులో హైకోర్టు పెట్టుకుని, పులివెందులను రాజధాని చేస్తే… జగన్‌ మోహన్ రెడ్డికి కేసుల విషయంలో కోర్టుకు హాజరవడం ఈజీగా ఉంటుందంటూ పవన్ కల్యాణ్ హేళన చేశారు. ఈ వ్యాఖ్యలపై రాయలసీమ యువత మండిపడుతోంది. పవన్ కల్యాణ్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో విపరీతమైన పోస్టులు వస్తున్నాయి.

కొందరు పవన్ కల్యాణ్‌ను నోటికొచ్చినట్టు తిడుతున్నారు. చంద్రబాబుతో సహవాసం కారణంగా పవన్ కల్యాణ్‌కు తెలియకుండానే సీమపై ద్వేషం పెరిగిందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. రాయలసీమను కించపరిచే వ్యాఖ్యలను ఎక్కడో కూర్చుని కాకుండా రాయలసీమ ప్రాంతానికి వచ్చి ఈ తరహా వ్యాఖ్యలు చేయాలని సవాల్ చేస్తున్నారు.

రాయలసీమ ప్రాంతంలో హైకోర్టు, రాజధాని ఏర్పాటుకు అర్హత లేని ప్రాంతంగా పవన్ కల్యాణ్‌ భావిస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు. ఆంధ్ర తొలి రాజధాని కర్నూలు అన్న సంగతి రెండు లక్షల పుస్తకాల్లో పవన్ కల్యాణ్‌కు ఎక్కడా కనిపించలేదా అని ప్రశ్నిస్తున్నారు.

పవన్ విద్వేషపూరిత వ్యాఖ్యలపై కత్తి మహేష్‌ సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందించారు. ”ఏరా పవన్ కల్యాణ్‌” అంటూ కౌంటర్‌ ఇచ్చారు. ” ఏరా పవన్ కళ్యాణ్… పులివెందులలో రాజధాని, కర్నూలులో హైకోర్టు పెట్టుకోమని ఏకసెక్కలాడతావా? న్యాయబద్ధంగా రాయలసీమ ప్రజల హక్కులురా అవి పుండాకోర్! నీకు అది మజాక్ గా అనిపిస్తోందా? మళ్ళీ గుండుకావాలని కోరిక ఏమైనా కలుగుతోందా నీకు! ఖబడ్దార్ !!” అంటూ హెచ్చరించారు.

పవన్ కల్యాణ్‌ తీరు చూస్తుంటే ఆయన పుట్టిందే ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య వైషమ్యాలు సృష్టించేందుకు అన్నట్టుగా ఉందని ఒక నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌మోహన్ రెడ్డితో శతృత్వం ఉంటే నేరుగా ఆయనతో తేల్చుకోవాలి గానీ… ప్రాంతాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం ఏ తరహా సంస్కారం అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

ఏరా పవన్ కళ్యాణ్…పులివెందులలో రాజధాని, కర్నూలులో హైకోర్టు పెట్టుకోమని ఏకసెక్కలాడతావా? న్యాయబద్ధంగా రాయలసీమ ప్రజల…

Posted by Mahesh Kathi on Tuesday, 5 November 2019

First Published:  6 Nov 2019 3:05 AM IST
Next Story