లంచగొండిని నిలదీసిన మహిళ.... సిగ్గుతో జారుకున్న రెవెన్యూ ఉద్యోగులు
భువనగిరి జిల్లా గుండాల మండల రెవెన్యూ సిబ్బందికి ఊహించని అనుభవం ఎదురైంది. తహసీల్దార్ విజయారెడ్డి హత్యకు నిరసనగా రెవెన్యూ ఉద్యోగులు ధర్నాకు దిగారు. రెవెన్యూ ఉద్యోగులకు రక్షణ కలిపించాలని డిమాండ్ చేశారు. ఇంతలో అక్కడికి ఇద్దరు రెవెన్యూ బాధితులు వచ్చారు. అన్ని సక్రమంగా ఉన్నా సరే ఎందుకు ఫైల్ క్లియర్ చేయడం లేదంటూ ఒక పెద్దాయన ఉద్యోగులను నిలదీశారు. ఎన్నిసార్లు తిప్పుకుంటారని ప్రశ్నించారు. వచ్చిన ప్రతిసారి ఖర్చులను ఎవరు భరిస్తారని నిలదీశారు. ఇంతలో అక్కడికి వచ్చిన మహిళా […]
భువనగిరి జిల్లా గుండాల మండల రెవెన్యూ సిబ్బందికి ఊహించని అనుభవం ఎదురైంది. తహసీల్దార్ విజయారెడ్డి హత్యకు నిరసనగా రెవెన్యూ ఉద్యోగులు ధర్నాకు దిగారు. రెవెన్యూ ఉద్యోగులకు రక్షణ కలిపించాలని డిమాండ్ చేశారు. ఇంతలో అక్కడికి ఇద్దరు రెవెన్యూ బాధితులు వచ్చారు.
అన్ని సక్రమంగా ఉన్నా సరే ఎందుకు ఫైల్ క్లియర్ చేయడం లేదంటూ ఒక పెద్దాయన ఉద్యోగులను నిలదీశారు. ఎన్నిసార్లు తిప్పుకుంటారని ప్రశ్నించారు. వచ్చిన ప్రతిసారి ఖర్చులను ఎవరు భరిస్తారని నిలదీశారు.
ఇంతలో అక్కడికి వచ్చిన మహిళా అందుకున్నారు. రెవెన్యూ ఉద్యోగులు లంచాల కోసం పీక్కుతింటున్నారంటూ మహిళ మండిపడ్డారు.
ధర్నాలో రెవెన్యూ ఉద్యోగులంతా కూర్చుని ఉండగానే ఆమె ఫైర్ అయ్యారు. తన వద్ద రెండువేల రూపాయలు లంచం తీసుకున్న రెవెన్యూ ఉద్యోగి కూడా ధర్నాలో కూర్చోని ఉండడం గమనించిన సదరు బాధితురాలు… తన వద్ద తీసుకున్న రెండువేల రూపాయలు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే చొక్కా గల్లా పట్టుకుని ఈడుస్తా అంటూ అందరి ముందే హెచ్చరించింది.
దీంతో లంచం తీసుకున్న సదరు రెవెన్యూ ఉద్యోగి నోట మాట రాలేదు. తల నేలకేసుకుని కూర్చున్నాడు.
ప్రజలు తమను నిలదీస్తున్న దృశ్యాలను అక్కడే ఉన్న కొందరు సెల్‌ఫోన్లలో రికార్డు చేస్తున్న విషయాన్ని గమనించిన ఉద్యోగులు హఠాత్తుగా ధర్నా ఎత్తేసి లోపలికి వెళ్లిపోయారు.