Telugu Global
NEWS

డెడ్ లైన్‌లకు భయపడం.... సమ్మె కొనసాగిస్తాం : ఆర్టీసీ జేఏసీ

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె నెల రోజులు దాటినా ఇంకా కొనసాగుతూనే ఉంది. అటు ప్రభుత్వం, ఇటు కార్మిక సంఘాలు ఏ మాత్రం పట్టు విడువకుండా ఉండటంతో సమ్మెకు తుది అంకం అనేది లేకుండా పోయింది. ఇక ఈ రోజు అర్థరాత్రి 12 దాటితే సమ్మెలో ఉన్న ఏ ఒక్క కార్మికుడినీ చేర్చుకునేది లేదని సీఎం కేసీఆర్ డెడ్ లైన్ విధించారు. ఇప్పటికే 5 వేలకు పైగా రూట్లను ప్రైవేటుకు అప్పగిస్తూ క్యాబినెట్ నిర్ణయం […]

డెడ్ లైన్‌లకు భయపడం.... సమ్మె కొనసాగిస్తాం : ఆర్టీసీ జేఏసీ
X

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె నెల రోజులు దాటినా ఇంకా కొనసాగుతూనే ఉంది. అటు ప్రభుత్వం, ఇటు కార్మిక సంఘాలు ఏ మాత్రం పట్టు విడువకుండా ఉండటంతో సమ్మెకు తుది అంకం అనేది లేకుండా పోయింది.

ఇక ఈ రోజు అర్థరాత్రి 12 దాటితే సమ్మెలో ఉన్న ఏ ఒక్క కార్మికుడినీ చేర్చుకునేది లేదని సీఎం కేసీఆర్ డెడ్ లైన్ విధించారు. ఇప్పటికే 5 వేలకు పైగా రూట్లను ప్రైవేటుకు అప్పగిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది… మరోవైపు ఇవాళ కార్మికులు చేరకుంటే మొత్తం ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తోంది.

పలువురు మంత్రులు కూడా కార్మికులను సమ్మె విరమింపజేసేలా వ్యాఖ్యలు చేశారు. అయినా సరే సమ్మెలో ఉన్న కార్మికులు మాత్రం అన్నింటికీ తెగించినట్లు కనపడుతున్నారు.

ఇవాళ అర్థరాత్రి డెడ్‌లైన్ కావడంతో ఆర్టీసీ జేఏసీ నాయకులు అత్యవసరంగా భేటీ అయ్యారు. ఈ కీలక సమావేశంలో ఆర్టీసీ జేఏసీ నేతలతో పాటు.. రాజకీయ పార్టీలు, ట్రేడ్ యూనియన్లు, ప్రజా సంఘాల నాయకులతో చర్చించారు. ప్రభుత్వం ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా, బెదిరించినా సమ్మెను విరమించవద్దని వారు కోరారు.

కార్మికులందరూ ఇలాంటి పోరాట పటిమనే కొనసాగించి.. మన డిమాండ్లను చర్చల ద్వారానే పరిష్కరించుకుందామని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. కేసీఆర్ విధించే డెడ్‌లైన్ లకు తాము భయపడమని, కార్మికులు కూడా భయపడకుండా సమ్మెను కొనసాగించాలని నాయకులు కోరారు.

First Published:  5 Nov 2019 5:03 AM GMT
Next Story