Telugu Global
Cinema & Entertainment

వెంకటేష్ దెబ్బకు మరో దర్శకుడు బలి

కథ వింటాడు, పూర్తి స్క్రీన్ ప్లే కావాలంటాడు, నిర్ణయం మాత్రం వెంటనే తీసుకోడు. నెలల తరబడి నాన్చుతాడు. ఇలా వెంకటేష్ చేతిలో దెబ్బతిన్న దర్శకులు చాలామంది ఉన్నారు. అశోక్, తేజ రీసెంట్ బాధితులు. తాజాగా ఈ లిస్ట్ లోకి మరో దర్శకుడు కూడా చేరాడు. అతడి పేరు త్రినాథరావు నక్కిన. అతికష్టమ్మీద ఓ స్టోరీలైన్ తో వెంకీని ఒప్పించాడు త్రినాథరావు నక్కిన. తన ఆస్థాన రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ తో కలిసి స్క్రీన్ ప్లే కోసం […]

వెంకటేష్ దెబ్బకు మరో దర్శకుడు బలి
X

కథ వింటాడు, పూర్తి స్క్రీన్ ప్లే కావాలంటాడు, నిర్ణయం మాత్రం వెంటనే తీసుకోడు. నెలల తరబడి నాన్చుతాడు. ఇలా వెంకటేష్ చేతిలో దెబ్బతిన్న దర్శకులు చాలామంది ఉన్నారు. అశోక్, తేజ రీసెంట్ బాధితులు. తాజాగా ఈ లిస్ట్ లోకి మరో దర్శకుడు కూడా చేరాడు. అతడి పేరు త్రినాథరావు నక్కిన.

అతికష్టమ్మీద ఓ స్టోరీలైన్ తో వెంకీని ఒప్పించాడు త్రినాథరావు నక్కిన. తన ఆస్థాన రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ తో కలిసి స్క్రీన్ ప్లే కోసం దాదాపు 3 నెలలు టైమ్ తీసుకున్నాడు. కిందామీదా పడి స్క్రీన్ ప్లే కూడా రాసుకున్నారు. కట్ చేస్తే, అది వెంకీకి నచ్చలేదు. అలా ఆర్నెళ్ల పాటు దగ్గుబాటి కాంపౌండ్ లో తిరిగిన త్రినాథరావు నక్కిన, ఇప్పుడు అక్కడ్నుంచి బయటకు వచ్చేశాడు.

వెంకీ కోసం రాసుకున్న స్క్రిప్ట్ ను స్క్రీన్ ప్లేతో పాటు యథాతథంగా రవితేజకు వినిపించాడు. మాస్ రాజా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

త్వరలోనే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు రవితేజ.

ఆ సినిమా కంప్లీట్ అయిన వెంటనే వెంకీ కోసం అనుకున్న కథతో రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో సినిమా పట్టాలపైకి వస్తుంది. అదన్నమాట సంగతి.

First Published:  5 Nov 2019 9:00 AM
Next Story