భారత టేబుల్ టెన్నిస్ లో సరికొత్త చరిత్ర
9వ ర్యాంక్ లో నిలిచిన భారత పురుషుల జట్టు భారత టేబుల్ టెన్నిస్ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదయ్యింది. భారత పురుషుల జట్టు తొలిసారిగా అత్యుత్తమ ర్యాంకు నమోదు చేసింది. ప్రపంచ టేబుల్ టెన్నిస్ సమాఖ్య తాజా ర్యాంకింగ్స్ ప్రకారం భారతజట్టు 9వ ర్యాంక్ సాధించింది. చైనా, జపాన్,జర్మనీ మొదటి మూడు ర్యాంకుల్లో కొనసాగుతున్నాయి. భారత ఆటగాళ్లలో సత్యన్ 30, శరత్ కమల్ 36, హర్మీత్ దేశాయ్ 104 ర్యాంకుల్లో ఉన్నారు. భారత్, ఆస్ట్ర్రియా జట్లు చెరో 272 […]
- 9వ ర్యాంక్ లో నిలిచిన భారత పురుషుల జట్టు
భారత టేబుల్ టెన్నిస్ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదయ్యింది. భారత పురుషుల జట్టు తొలిసారిగా అత్యుత్తమ ర్యాంకు నమోదు చేసింది. ప్రపంచ టేబుల్ టెన్నిస్ సమాఖ్య తాజా ర్యాంకింగ్స్ ప్రకారం భారతజట్టు 9వ ర్యాంక్ సాధించింది.
చైనా, జపాన్,జర్మనీ మొదటి మూడు ర్యాంకుల్లో కొనసాగుతున్నాయి. భారత ఆటగాళ్లలో సత్యన్ 30, శరత్ కమల్ 36, హర్మీత్ దేశాయ్ 104 ర్యాంకుల్లో ఉన్నారు.
భారత్, ఆస్ట్ర్రియా జట్లు చెరో 272 పాయింట్ల చొప్పున సాధించి సమానస్థితిలో ఉన్నా..సత్యన్, శరత్ కమల్ వ్యక్తిగతంగా మొదటి 40 ర్యాంకుల్లో నిలవడంతో…భారత్ 9, ఆస్ట్ర్రియా 10 ర్యాంకుల్లో ఉన్నట్లు ప్రకటించారు.