Telugu Global
National

మోడీకి జగన్ లేఖ

ప్రధాని మోడీకి ఏపీ సీఎం వైఎస్ జగన్‌ లేఖ రాశారు. ఒడిషా తాల్చేరులోని మందాకిని బొగ్గు క్షేత్రంలోని బొగ్గును ఏపీ జెన్‌కోకు కేటాయించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.  రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కనీస బొగ్గు నిల్వలను కూడా కేటాయించలేదని లేఖలో గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ ప్లాంట్‌లకు ఒడిషాలోని మహానది బొగ్గు క్షేత్రంతో పాటు, సింగరేణి నుంచి మాత్రమే బొగ్గు సరఫరా అయ్యేదని వివరించారు. విభజన సమయంలో సింగరేణి నుంచి కూడా కనీస బొగ్గును […]

మోడీకి జగన్ లేఖ
X

ప్రధాని మోడీకి ఏపీ సీఎం వైఎస్ జగన్‌ లేఖ రాశారు. ఒడిషా తాల్చేరులోని మందాకిని బొగ్గు క్షేత్రంలోని బొగ్గును ఏపీ జెన్‌కోకు కేటాయించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కనీస బొగ్గు నిల్వలను కూడా కేటాయించలేదని లేఖలో గుర్తు చేశారు.

ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ ప్లాంట్‌లకు ఒడిషాలోని మహానది బొగ్గు క్షేత్రంతో పాటు, సింగరేణి నుంచి మాత్రమే బొగ్గు సరఫరా అయ్యేదని వివరించారు. విభజన సమయంలో సింగరేణి నుంచి కూడా కనీస బొగ్గును ఏపీకి కేటాయించలేదని గుర్తు చేశారు.

పూర్తిగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బొగ్గుపైనే ఏపీ ఆధారపడాల్సి వస్తోందని వివరించారు. దీనివల్ల రాష్ట్ర విద్యుత్‌ రంగంలో భరోసా లేకుండా పోయింది. పొరుగున ఉన్న ఒడిశా రాష్ట్రంలో అపారమైన బొగ్గు నిక్షేపాలున్నాయని… ఐబీ వ్యాలీ, తాల్చేరు క్షేత్రాల్లో భారీగా బొగ్గు నిల్వలున్నాయన్నారు.

వాణిజ్య అవసరాల కోసం మధ్యప్రదేశ్‌లో ఒకటి, చత్తీస్‌ఘడ్‌లో ఒక గనిని ఏపీఎండీసీకి కేటాయించినా…. ఆ గనుల నుంచి బొగ్గు వెలికితీయడానికి నిర్వహణా వ్యయం చాలా అధికంగా ఉందని లేఖలో వివరించారు. ఈ నేపథ్యంలో తాల్చేరు కోల్‌ ఫీల్డ్‌ను ఏపీ జెన్‌కోకి కేటాయించాలని జగన్‌ కోరారు.

First Published:  5 Nov 2019 2:27 PM IST
Next Story