నీ రహస్యాలు బయటపెడితే తలెత్తుకోలేవు పవన్?
ఇసుక కొరత విషయంలో వైసీపీ ప్రభుత్వంపై ఆడిపోసుకుంటున్న పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ. చంద్రబాబు ఆయన ఫ్రెండ్ పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందర ఇంటర్నల్ గా.. ఇప్పుడు ఎక్స్ టర్నల్ గా వేస్తున్న దొంగవేషాలు తమకు తెలుసని ఫైర్ అయ్యారు. సినిమాల్లో చూపించాల్సిన యాక్షన్ అంతా పవన్ రాజకీయాల్లో చేస్తున్నారని పవన్ పై మండిపడ్డారు బొత్స సత్యనారాయణ. పవన్ గురించి తనకు కొన్ని విషయాలు తెలుసు అని.. వాటిని బయటపెడితే తలకాయ […]
ఇసుక కొరత విషయంలో వైసీపీ ప్రభుత్వంపై ఆడిపోసుకుంటున్న పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ.
చంద్రబాబు ఆయన ఫ్రెండ్ పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందర ఇంటర్నల్ గా.. ఇప్పుడు ఎక్స్ టర్నల్ గా వేస్తున్న దొంగవేషాలు తమకు తెలుసని ఫైర్ అయ్యారు. సినిమాల్లో చూపించాల్సిన యాక్షన్ అంతా పవన్ రాజకీయాల్లో చేస్తున్నారని పవన్ పై మండిపడ్డారు బొత్స సత్యనారాయణ.
పవన్ గురించి తనకు కొన్ని విషయాలు తెలుసు అని.. వాటిని బయటపెడితే తలకాయ ఎక్కడ పెట్టుకుంటారో కూడా తెలియదని మంత్రి బొత్స సత్యనారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
2014లో తనను పెద్ద పుడింగి అయ్యింటే గెలిచేవాడివి అని ఎద్దేవా చేశాడని… మరి 2019లో పవన్ ఎందుకు గెలువలేదని ప్రశ్నించారు. వాస్తవాలు అంగీకరించకుండా పుడింగి అనుకోవడం సరికాదని బొత్స సెటైర్ వేశారు.
చంద్రబాబు హయాంలో ఎన్నో ఆకృత్యాలు, దారుణాలు జరిగినా ఈ హీరో పవన్ గారు ఎందుకు స్పందించలేదని బొత్స కడిగిపారేశారు. సమయం సందర్భం లేకుండా మాట్లాడితే ప్రజలు ఇలానే బొందపెడుతారని పవన్ ను విమర్శించారు.
ఇండియా మ్యాపులో అమరావతి పేరు లేకుండా చేసిన పాపం చంద్రబాబుదేనని బొత్స మండిపడ్డారు. అమరావతిని రాజధానిగా గుర్తించి నోటిఫికేషన్ వేయాల్సిన బాబు అది మరిచిపోయి ఇప్పుడు రాజధానికి అడ్రస్ లేకుండా చేశారని మండిపడ్డారు.
రాష్ట్ర రాజధాని విషయంలో ఇంతటి ఘోరమైన తప్పిదం చేసి అడ్రస్ లేకుండా చేసిన చంద్రబాబు వైసీపీని విమర్శించడం సిగ్గుచేటన్నారు. సుజనా లాంటి చంద్రబాబు తోకలు కూడా వైసీపీని విమర్శిస్తారా అని మండిపడ్డారు. చంద్రబాబు, సుజనా లాంటి వాళ్ల వల్లే రాజధానికి అడ్రస్ లేకుండా పోయిందని బొత్స అన్నారు.