Telugu Global
NEWS

తెలంగాణలో ఎన్నికల సందడి.... పుర పోరుకు పార్టీలు సమాయత్తం..!

తెలంగాణలో మరో సారి ఎన్నికల సందడి మొదలైంది. పరిపాలనలో కీలకమైన కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఎన్నికలకు రంగం సిద్దమవుతోంది. పురపాలక ఎన్నికలకు త్వరలోనే నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. పార్టీలో ఉండే ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు ఎవరికి వారు ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. పురపాలక ఎన్నికలు గతంలోనే నిర్వహించాల్సి ఉన్నా.. కోర్టు కేసులు, స్టేల నేపథ్యంలో వాయిదా పడింది. కాగా ఇటీవల హైకోర్టు ధర్మాసనం మున్సిపల్ ఎన్నికల […]

తెలంగాణలో ఎన్నికల సందడి.... పుర పోరుకు పార్టీలు సమాయత్తం..!
X

తెలంగాణలో మరో సారి ఎన్నికల సందడి మొదలైంది. పరిపాలనలో కీలకమైన కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఎన్నికలకు రంగం సిద్దమవుతోంది. పురపాలక ఎన్నికలకు త్వరలోనే నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. పార్టీలో ఉండే ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు ఎవరికి వారు ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు.

పురపాలక ఎన్నికలు గతంలోనే నిర్వహించాల్సి ఉన్నా.. కోర్టు కేసులు, స్టేల నేపథ్యంలో వాయిదా పడింది. కాగా ఇటీవల హైకోర్టు ధర్మాసనం మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్, మున్సిపల్ శాఖ ఎన్నికల నిర్వహణకు కసరత్తు ముమ్మరం చేసింది.

రాష్ట్రంలోని 129 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 77 మున్సిపాలిటీల ఎన్నికల విషయంలో స్టే ఉంది. అయితే, త్వరలోనే దీనిపై సానుకూలంగా తీర్పు వెలువడి నోటిషఫికేషన్ వస్తుందని పార్టీలు భావిస్తున్నాయి.

ఓటర్ల జాబితాలో అవకతవకలు, వార్డుల పునర్విభజన తదితర అంశాలపై గతంలో స్టేలు ఉన్న మున్సిపాలటీల వ్యవహారంపై ఇవాళ హైకోర్టు విచారణ చేయనుంది. ఇవాళ పూర్తి స్థాయి విచారణ జరిగి తీర్పు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం కూడా భావిస్తోంది. హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తే రిజర్వేషన్లను రెండు మూడు రోజుల్లోనే ప్రకటించే వీలుంది. ఈ నేపథ్యంలో ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

పాత మున్సిపాలిటీల కంటే కొత్త మున్సిపాలిటీల్లోనే ఎన్నికల హడావిడి ఎక్కువగా కనిపిస్తోంది. గతంలో పంచాయితీ వార్డు మెంబర్లుగా ఉన్న వాళ్లు ఈ సారి కౌన్సిలర్లుగా మారాలని తహతహలాడుతున్నారు. దీనికి తోడు తమ ప్రాంతంలోని వార్డుల రిజర్వేషన్లు ఎలా ఉండబోతున్నాయనే ఉత్కంఠత కూడా ఉంది. అయినప్పటికీ ఇప్పటి నుంచే పలువురు ఆశావహులు వార్డుల బాట పట్టారు. ఓటర్లను ప్రసన్నం చేసుకొని ఎన్నికలకు ముందస్తు గానే తయారవుతున్నారు.

గతంలో వార్డు మెంబర్లుగా, కౌన్సిలర్లుగా చేసిన వాళ్లల్లో 80శాతం మంది తిరిగి పోటీ చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో స్థానిక పరిస్థితుల ప్రభావమే ఎక్కువగా ఉంటుంది కాబట్టి అన్ని పార్టీల్లోని చోటా నాయకులు, కార్యకర్తలు పార్టీ టికెట్ ఎలాగైనా దక్కించుకోవాలనే ప్రయత్నాలను ప్రారంభించారు.

హైకోర్టు కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు ఒకే దఫా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.

First Published:  4 Nov 2019 2:12 AM IST
Next Story