Telugu Global
NEWS

ఇసుక కొరత ఈ నెలాఖరు దాకే...

ఇసుక కొరత అన్నది తాత్కాలిక సమస్య అని, 90 రోజులుగా ఊహించని రీతిలో రాష్ట్రంలోని నదులకు వరద వస్తోందని, దాంతో ఇసుక లభ్యత తగ్గిందని, నవంబర్‌ నెలాఖరు నాటికి పూర్తిగా సమస్య తీరుతుందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. ప్రస్తుతం 265కి పైగా రీచ్‌ల్లో కేవలం 61 మాత్రమే పనిచేస్తున్నాయని… మిగతా రీచ్‌లన్నీ వరద నీటిలో మునిగి ఉన్నాయని, అక్కడ నుంచి ఇసుక తీయడం కష్టంగా ఉందని… లారీలు, ట్రాక్టర్లు వెళ్లలేని పరిస్థితి […]

ఇసుక కొరత ఈ నెలాఖరు దాకే...
X

ఇసుక కొరత అన్నది తాత్కాలిక సమస్య అని, 90 రోజులుగా ఊహించని రీతిలో రాష్ట్రంలోని నదులకు వరద వస్తోందని, దాంతో ఇసుక లభ్యత తగ్గిందని, నవంబర్‌ నెలాఖరు నాటికి పూర్తిగా సమస్య తీరుతుందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు.

ప్రస్తుతం 265కి పైగా రీచ్‌ల్లో కేవలం 61 మాత్రమే పనిచేస్తున్నాయని… మిగతా రీచ్‌లన్నీ వరద నీటిలో మునిగి ఉన్నాయని, అక్కడ నుంచి ఇసుక తీయడం కష్టంగా ఉందని… లారీలు, ట్రాక్టర్లు వెళ్లలేని పరిస్థితి నెలకొందని… ఇప్పుడు మీరు ప్రకాశం బ్యారేజీకి వెళ్లిచూసినా.. గేట్లు ఎత్తే ఉన్నాయి, వరదనీరు ప్రవహిస్తూనే ఉందని ఆయన చెప్పారు.

90 రోజులుగా కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి చివరకు పెన్నా నదిలో కూడా వరద వస్తోందని… ఈ వరద తగ్గగానే ఇసుక సరఫరా బాగా పెరుగుతుందని, ప్రాధాన్యతా రంగాలకు ఇసుక ఇవ్వడానికి వెంటనే ప్రత్యేక స్టాక్‌యార్డులు కూడా ఏర్పాటు చేస్తామని, ఇసుక అన్నది తాత్కాలిక సమస్య మాత్రమేనని ఆయన అన్నారు.

ఇలా వరదలు రావడం రైతులకు, పంటలకు, భూగర్భజలాలకు మంచిదని, అయితే నిరంతరం వరద వల్ల ఇసుక సమస్య వస్తోందని…. గత ఐదేళ్లుగా ఇసుక మాఫియా నడిచిందని… పొక్లెయినర్‌ లతో, భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేశారని…
ఇప్పుడు మా ప్రభుత్వం మాన్యువల్‌గా చేయిస్తున్నదని… గత ఐదేళ్లలో పేరుకే ఇసుక ఫ్రీ అని చెప్పారు గానీ మాఫియా నడిపారు.

ఇప్పుడు మేం చాలా పారదర్శకంగా, అవినీతికి ఆస్కారం లేకుండా చేస్తున్నాం. ప్రజలకు, పేదలకు మేలు చేసేలా మార్గదర్శకాలు రూపొందించాం. కిలోమీటర్‌కు రూ. 4.90 లకు ఎవరైతే రవాణా చేస్తారో వారిని రమ్మన్నాం… గత ప్రభుత్వంలో అనధికారికంగా తెలుగుదేశం నేతలు ఇసుకను అమ్ముకున్నారని, ఇప్పుడు మాత్రం చాలా కొద్ది మొత్తానికి ఇసుకను వినియోగదారులకు అందించేలా…. ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా మార్గదర్శకాలు రూపొందించామని…. ఈ నెలాఖరు తరువాత ఇసుక సమస్య ఉండదని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి చెప్పారు.

First Published:  4 Nov 2019 10:44 AM IST
Next Story