మా చేతుల్లో బిళ్ళలు... వారితో సెల్ఫీలు " మోడీతో భేటీలపై ఎస్పీ బాలు
అక్టోబర్ ఆఖరిలో సినీ సెలబ్రెటీలతో మోడీ నిర్వహించిన భేటీపై విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ కార్యక్రమానికి కేవలం బాలీవుడ్ నటులను మాత్రమే ఆహ్వానించిన మోడీ… సౌత్ ఇండియా నటులను పూర్తిగా దూరంగా పెట్టారు. దానిపై రామ్‌చరణ్ భార్య ఉపాసన ఆ రోజే స్పందించారు. సౌత్ ఇండియా చిత్రపరిశ్రమను పట్టించుకోకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఖుష్బూ కూడా ఉపాసనకు మద్దతుగా నిలిచారు. సౌత్ ఇండస్ట్రీకి చెందిన హీరోలు మాత్రం బహిరంగంగా మాట్లాడేందుకు సాహసించలేదు. అయితే ఆ […]

అక్టోబర్ ఆఖరిలో సినీ సెలబ్రెటీలతో మోడీ నిర్వహించిన భేటీపై విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ కార్యక్రమానికి కేవలం బాలీవుడ్ నటులను మాత్రమే ఆహ్వానించిన మోడీ… సౌత్ ఇండియా నటులను పూర్తిగా దూరంగా పెట్టారు. దానిపై రామ్‌చరణ్ భార్య ఉపాసన ఆ రోజే స్పందించారు. సౌత్ ఇండియా చిత్రపరిశ్రమను పట్టించుకోకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.
ఖుష్బూ కూడా ఉపాసనకు మద్దతుగా నిలిచారు. సౌత్ ఇండస్ట్రీకి చెందిన హీరోలు మాత్రం బహిరంగంగా మాట్లాడేందుకు సాహసించలేదు. అయితే ఆ రోజు మోడీతో జరిగిన భేటీలో తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ఒకరిద్దరుకనిపించారు. వారిలో ఎస్పీ బాలసుబ్రమణ్యం కూడా ఒకరు. బాలసుబ్రమణ్యానికి కూడా నేరుగా మోడీ కార్యాలయం నుంచి ఆహ్వానం అందలేదన్న విషయం ఇప్పుడు స్పష్టమైంది. తాను రామోజీరావు సాయంతో మోడీ కార్యక్రమానికి వెళ్లగలిగానని ఎస్పీ బాలసుబ్రమణ్యం వివరించారు.
ఆ భేటీలో తమకు ఎదురైన చేదు అనుభవాన్ని తాజాగా సోషల్ మీడియాలో వెల్లడించారు. సౌత్ ఇండియాకు చెందిన వారికి ఎదురైన వివక్షను వివరించారు. తాము కార్యక్రమానికి వెళ్లగా గేటు వద్దే సెల్‌ఫోన్లను భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారని ఆయన వివరించారు.
సెల్‌ఫోన్లు తీసుకుని చేతిలో టోకెన్ బిళ్ళ పెట్టి లోపలికి పంపించారన్నారు. కానీ కార్యక్రమంలో కొందరు స్టార్స్ తమ సెల్‌ఫోన్ల సాయంలో మోడీతో సెల్ఫీలు తీసుకోవడం చూసి గందరగోళానికి గురయ్యానన్నారు. తమ ఫోన్లను సెక్యూరిటీ తీసుకున్నారని… మరి వారికి సెల్‌ఫోన్లు ఎలా వచ్చాయి అని పరోక్షంగా ప్రశ్నించారు.
కార్యక్రమంలో మోడీతో బాలీవుడ్ హీరోలు, హీరోయిన్ల సెల్ఫీలకు సంబంధించిన ఫోటోలను కూడా బాలసుబ్రమణ్యం షేర్ చేశారు. పరోక్షంగా మోడీతో జరిగిన కార్యక్రమంలో బాలీవుడ్‌కు ప్రాధాన్యత ఇచ్చి… సౌత్ ఇండస్ట్రీకి చెందిన తమ చేతుల్లో టోకెన్ లు పెట్టి అవమానించారని ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆవేదన చెందారు.
I am grateful to Ramoji Raoji, (Eenadu), because of whom I was able to attend a reception hosted by our Hon. Prime…
Posted by S. P. Balasubrahmanyam on Saturday, 2 November 2019