ఆ తరువాతే ఓ నిర్ణయం తీసుకుంటాడట..!
దిల్ రాజు దర్శకత్వంలో పింక్ రీమేక్ చేస్తాడంటూ కొందరు వాదిస్తున్నారు. అలాంటిందే లేదు, క్రిష్ దర్శకత్వంలో ఏఎమ్ రత్నం నిర్మాతగా సినిమా చేస్తాడని మరికొందరు వాదిస్తున్నారు. మొత్తమ్మీద పవన్ రీఎంట్రీ మాత్రం ఖాయం అంటూ 2 రోజులుగా కథనాలు పుంఖానుపుంఖాలుగా వస్తూనే ఉన్నాయి. ఎట్టకేలకు పవన్ టీం నుంచి దీనిపై క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతానికి పవన్ నుంచి ఎలాంటి గ్రీన్ సిగ్నల్ లేదనేది ఆ ప్రకనట సారాంశం. ప్రస్తుతం పవన్ రాజకీయాలపైనే పూర్తిగా దృష్టిపెడుతున్నారట. ఇసుక కొరతపై […]
దిల్ రాజు దర్శకత్వంలో పింక్ రీమేక్ చేస్తాడంటూ కొందరు వాదిస్తున్నారు. అలాంటిందే లేదు, క్రిష్ దర్శకత్వంలో ఏఎమ్ రత్నం నిర్మాతగా సినిమా చేస్తాడని మరికొందరు వాదిస్తున్నారు. మొత్తమ్మీద పవన్ రీఎంట్రీ మాత్రం ఖాయం అంటూ 2 రోజులుగా కథనాలు పుంఖానుపుంఖాలుగా వస్తూనే ఉన్నాయి. ఎట్టకేలకు పవన్ టీం నుంచి దీనిపై క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతానికి పవన్ నుంచి ఎలాంటి గ్రీన్ సిగ్నల్ లేదనేది ఆ ప్రకనట సారాంశం.
ప్రస్తుతం పవన్ రాజకీయాలపైనే పూర్తిగా దృష్టిపెడుతున్నారట. ఇసుక కొరతపై చేస్తున్న లాంగ్ మార్చ్ తో పాటు మరికొన్ని పొలిటికల్ ప్రొగ్రామ్స్ ఈ నెలలో ఉన్నాయట. అవన్నీ పూర్తయిన తర్వాత మాత్రమే సినిమాలపై పవన్ ఓ నిర్ణయం తీసుకుంటారనేది ఆయన సన్నిహితులు చెబుతున్న మాట. మరోవైపు బాలీవుడ్ నుంచి కూడా పవన్ రీఎంట్రీపై వస్తున్న వార్తలపై అతడి సన్నిహితులు స్పందించారు.
కేవలం కొంతమంది నిర్మాతలు, దర్శకులు పవన్ పై వత్తిడి తెచ్చేందుకు ఇలా బాలీవుడ్ మీడియాను కూడా రంగంలోకి దించారని, తరణ్ ఆదర్శ్ లాంటి వ్యక్తులతో ట్వీట్లు పెట్టించారని చెబుతున్నారు. బాలీవుడ్ తో కాస్త కనెక్షన్ ఉన్న క్రిష్ ఈ పని చేసి ఉంటాడనేది మరో రూమర్.
మొత్తమ్మీద పవన్ రీఎంట్రీ మాత్రం తప్పదంటున్నారు చాలామంది. అటు జనసైనికులు కూడా పవన్ రీఎంట్రీ ఇస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు.