Telugu Global
NEWS

లాంగ్‌ మార్చ్‌లో పవన్‌ పక్కన ఇసుక డాన్, డ్రగ్‌ డాన్‌, లిక్కర్ డాన్ లు

విశాఖలో పవన్ కల్యాణ్ లాంగ్‌ మార్చ్ తలపెట్టడం…. దానికి జనాన్ని తరలించే బాధ్యతను స్వయంగా టీడీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు తమ భుజాలపై వేసుకోవడం బట్టి చంద్రబాబుకు పవన్ కల్యాణ్‌కు మధ్య ఉన్న బంధం ఏంటో అర్థమవుతోందని వైసీపీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, గుడివాడ అమర్నాథ్‌ విమర్శించారు. తన సొంత పుత్రుడితో పని కాదని నిర్ధారణకు వచ్చిన చంద్రబాబునాయుడు… దత్త పుత్రుడికి ప్యాకేజ్ ఇచ్చి లాంగ్ మార్చ్ చేయిస్తున్నారని ధర్మశ్రీ విమర్శించారు. కృష్ణా నది పక్కనే […]

లాంగ్‌ మార్చ్‌లో పవన్‌ పక్కన ఇసుక డాన్, డ్రగ్‌ డాన్‌, లిక్కర్ డాన్ లు
X

విశాఖలో పవన్ కల్యాణ్ లాంగ్‌ మార్చ్ తలపెట్టడం…. దానికి జనాన్ని తరలించే బాధ్యతను స్వయంగా టీడీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు తమ భుజాలపై వేసుకోవడం బట్టి చంద్రబాబుకు పవన్ కల్యాణ్‌కు మధ్య ఉన్న బంధం ఏంటో అర్థమవుతోందని వైసీపీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, గుడివాడ అమర్నాథ్‌ విమర్శించారు.

తన సొంత పుత్రుడితో పని కాదని నిర్ధారణకు వచ్చిన చంద్రబాబునాయుడు… దత్త పుత్రుడికి ప్యాకేజ్ ఇచ్చి లాంగ్ మార్చ్ చేయిస్తున్నారని ధర్మశ్రీ విమర్శించారు. కృష్ణా నది పక్కనే ఉన్న విజయవాడలో గానీ, గోదావరి ఒడ్డున ఉన్న రాజమండ్రిలో గానీ మార్చ్ చేయకుండా విశాఖలో చేయడం వెనుక కారణం ఏమిటని ప్రశ్నించారు.

నదుల సమీపంలో చేస్తే అక్కడికి వచ్చిన వారు కూడా వరదను చూసి ఇసుక తీయడం సాధ్యం కాదన్న నిర్ధారణకు వస్తారన్న ఆలోచనతోనే విశాఖలో లాంగ్ మార్చ్ పెడుతున్నారని విమర్శించారు.

ఈ ఏడాది భారీగా వర్షాలు వచ్చి పల్లెల్లో రైతులు సంతోషంగా ఉంటే దాన్ని చూసి తట్టుకోలేక ఇసుక మీద డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. వరదలు తగ్గగానే ఇసుక కొరత తీరుతుందని ప్రభుత్వం చెబుతున్నా… పవన్ కల్యాణ్ లాంగ్ మార్చ్‌కు సిద్ధమవడం వెనుక ఉద్దేశం ఏమిటని ధర్మశ్రీ నిలదీశారు.

నారావారి ప్రొడెక్షన్ నుంచి ప్యాకేజ్ తీసుకుని పవన్ కల్యాణ్ పనిచేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. ఒక్క సీటు గెలిచిన పిల్లసేన పార్టీ ..23 సీట్లు గెలిచిన ఇంకుడు గుంతల పార్టీ కలిసి లాంగ్‌మార్చ్‌ చేస్తామనడం చూసి జనం అసలు విషయాన్ని అర్థం చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

పవన్‌కల్యాణ్‌ సినిమాల్లో నటించడం ఎందుకు మానేశారో మొదట్లో ఎవరికీ అర్థం కాలేదని, సినిమాల్లో కన్నా చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీలే ఎక్కువని మానేశారని ప్రజలకు ఇప్పుడు అర్థమైందన్నారు.

టీడీపీ అధికారంలో ఉండగా శ్రీకాకుళం జిల్లాలో ఇసుక మాఫియాకు నాయకత్వం వహించిన అచ్చెన్నాయుడును పక్కన నిలబెట్టుకుని లాంగ్ మార్చ్ ఎలా చేస్తారని పవన్‌ కల్యాణ్‌ను ప్రశ్నించారు.

ఇసుక మాఫియా డాన్ అచ్చెన్నాయుడు, విశాఖ జిల్లా డ్రగ్ మాఫియా డాన్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, లిక్కర్ డాన్ వెలగపూడి రామకృష్ణలను పక్కన పెట్టుకుని వారితో పాటు మార్చ్ చేయడం ద్వారా ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు.

First Published:  2 Nov 2019 9:14 PM GMT
Next Story