Telugu Global
NEWS

కాలుష్య ఢిల్లీలో నేడే తొలి టీ-20

భారత్ కు బంగ్లాదేశ్ సవాల్ అరుణ్ జైట్లీ స్టేడియంలో రాత్రి 7 గంటల నుంచి మ్యాచ్ ప్రపంచకప్ కు సన్నాహాలలో భాగంగా బంగ్లాదేశ్ తో భారత్ మూడుమ్యాచ్ ల టీ-20 సిరీస్ లోని తొలిసమరానికి… న్యూఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా- అరుణ్ జైట్లీ స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది. ఢిల్లీలో వాయుకాలుష్యం తారాస్థాయికి చేరిన తరుణంలో ఈ మ్యాచ్ ను నిర్వహించడం చర్చనీయాంశంగా మారినా… రెండుజట్లూ మాత్రం ఇప్పటికే కోట్లా స్టేడియంలో నెట్ ప్రాక్టీస్ ను విజయవంతంగా ముగించాయి. వాతావరణంతో తమకు […]

కాలుష్య ఢిల్లీలో నేడే తొలి టీ-20
X
  • భారత్ కు బంగ్లాదేశ్ సవాల్
  • అరుణ్ జైట్లీ స్టేడియంలో రాత్రి 7 గంటల నుంచి మ్యాచ్

ప్రపంచకప్ కు సన్నాహాలలో భాగంగా బంగ్లాదేశ్ తో భారత్ మూడుమ్యాచ్ ల టీ-20 సిరీస్ లోని తొలిసమరానికి… న్యూఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా- అరుణ్ జైట్లీ స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది.

ఢిల్లీలో వాయుకాలుష్యం తారాస్థాయికి చేరిన తరుణంలో ఈ మ్యాచ్ ను నిర్వహించడం చర్చనీయాంశంగా మారినా… రెండుజట్లూ మాత్రం ఇప్పటికే కోట్లా స్టేడియంలో నెట్ ప్రాక్టీస్ ను విజయవంతంగా ముగించాయి.

వాతావరణంతో తమకు ఏమాత్రం సంబంధం లేదని…గతంలోనూ తాము ఢిల్లీ వేదికగా ముగిసిన టెస్ట్ మ్యాచ్ తో పాటు… పలు అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడామని.. అప్పుడులేని ఇబ్బంది ఇప్పుడూ లేదని భారత స్టాండిన్ కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు.

కీలక ఆటగాళ్లు లేకుండానే….

మూడుమ్యాచ్ ల ఈ సిరీస్ లో రెండుజట్లూ తమతమ కీలక ఆటగాళ్లు లేకుండానే సమరానికి సై అంటున్నాయి. 5వ ర్యాంకర్ భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ విశ్రాంతి తీసుకోడం ద్వారా జట్టుకు దూరమైతే….బంగ్లా కెప్టెన్ షకీబుల్ హసన్ పై ఐసీసీ రెండేళ్ల నిషేధం విధించడంతో దూరమయ్యాడు. అంతేకాదు…బంగ్లా సీనియర్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ సైతం వ్యక్తిగత కారణాలతో సిరీస్ కు దూరమయ్యాడు.

రెండుజట్లూ యువఆటగాళ్ల పైనే భారం మోపి బరిలోకి దిగుతున్నాయి. రెండుజట్ల ఫేస్ టు ఫేస్ రికార్డులు చూసినా…భారత్ దే తిరుగులేని ఆధిపత్యం కనిపిస్తోంది.

2014 నుంచి బంగ్లాదేశ్ తో ఎనిమిదిసార్లు తలపడిన భారత్ నూటికి నూరుశాతం విజయాల రికార్డుతో ఉంది.
మహ్మదుల్లా నాయకత్వంలో…. డాషింగ్ ఆల్ రౌండర్ షకీబుల్ హసన్ జట్టుకు దూరం కావడంతో…మరో ఆల్ రౌండర్ మహ్మదుల్లా నాయకత్వంలో బంగ్లాదేశ్ సవాలు విసురుతోంది.

మందకొడిగా ఉండే ఢిల్లీ స్టేడియం వికెట్ పై స్లోబౌలర్లు…ప్రధానంగా స్పిన్ బౌలర్లు మ్యాచ్ విన్నర్లుగా నిలిచే అవకాశం ఉంది.
యువఆల్‌రౌండర్ శివం దూబే, పేసర్ల జోడీ దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, సంజు శాంసన్ తమ సత్తా చాటుకోడానికి తహతహలాడుతున్నారు.

దశాబ్దాలుగా న్యూఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా స్టేడియంగా ఉన్న పేరును అరుణ్ జైట్లీ స్టేడియంగా మార్చిన తర్వాత…ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం.

160 నుంచి 180 పరుగుల స్కోరు సాధించిన జట్టుకే విజయావకాశాలు ఉంటాయి.

First Published:  3 Nov 2019 1:15 AM IST
Next Story